టీజర్ టాక్: ఐ లవ్ యు సూర్యా..!

Update: 2018-09-22 14:34 GMT
గతంలో చిన్న సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి అంటే ఎక్కువమంది పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు.  ఇప్పుడు చిన్న సినిమాలు సంచలన విజయాలు సాధిస్తుండడంతో అందరి దృష్టి వాటిపై మళ్ళింది.  ఇక తాజాగా 'అనగనగా ఒక ప్రేమకథ' అనే టైటిల్ తో కొత్తవారితో తెరకెక్కిన లవ్ స్టొరీ త్వరలో రిలీజ్ కు సిద్ధం అవుతోంది.  ఈ సినిమా టీజర్ ను కాసేపటి క్రితం రానా దగ్గుబాటి రిలీజ్ చేశాడు.

దర్శకుడు ఎన్. శంకర్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన టి. ప్రతాప్ ఈ సినిమా తో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు.  ప్రముఖ ఎడిటర్ మార్తాండ్.కె . వెంకటేష్ మేనల్లుడు విరాజ్ జె అశ్విన్ ఈ సినిమాలో హీరో.  రిద్ధి కుమార్..  రాధా బంగారు ఈ సినిమా ద్వారా హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.

ఇక టీజర్ విషయానికి వస్తే "ఐ లవ్ యూ సూర్యా" అంటూ హీరోయిన్ అరవడంతో స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ లో "ఎవరమ్మా ఆ సూర్య?"  అని హీరోయిన్ ను అడగగానే హీరో విరాజ్ ఇంట్రో.   హాకీ బ్యాట్లు పట్టుకొని ఓ డజను మంది హీరో ను తరుముతుంటారు. రెండు మూడు కట్ షాట్స్ లో హీరో ను అందంగా చూపించారు.  హీరోయిన్  "నాకు ఊహ వచ్చినప్పటినుంచి నాకు తెలిసిన ప్రేమ మా నాన్న.. రెండు నువ్వు" అనే ఎమోషనల్ డైలాగ్ చెబుతుంది.   ఫైనల్ గా హీరోయిన్ దగ్గరకు హీరో వచ్చి "ఐ లవ్ యూ" అని చెప్పగానే చెంప పగలగొట్టి "ఎవడ్రా నువ్వు"  అని షాక్ ఇస్తుంది.  ఇక టీజర్ లో పెద్దగా స్టొరీని రివీల్ చెయ్యలేదు.

ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.  విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా లవ్ స్టోరీ కి తగ్గట్టే  ప్లెజెంట్ గా ఉన్నాయి.  ప్రేమకథలు ఎన్ని వచ్చినా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి..  మీరు 'అనగనగా ప్రేమకథ' టీజర్ పై ఒక లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View

Tags:    

Similar News