మెగా మూవీకి అల్లు సౌండింగ్

Update: 2017-04-24 06:27 GMT
రామ్ చరణ్.. అల్లు అర్జున్.. వీరిద్దరి కాంబినేషన్ కోసం.. మెగాభిమానులు మాత్రమే కాదు.. టోటల్ టాలీవుడ్.. తెలుగు ప్రేక్షకులు అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చరణ్.. అర్జున్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించడంతో.. దీనికి సంబంధించిన పనులు జరిగిపోతున్నాయని.. త్వరలోనే మెగా పవర్ స్టార్- స్టైలిష్ స్టార్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభవుతుందనే టాక్ ఉంది.

ఆ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటైల్స్ రాలేదు కానీ.. ఇప్పుడు చరణ్- అర్జున్ ను ఓ మూవీ కోసం కలిసి పని చేయనున్నారు. నిజానికి ఎవడు సినిమాలో ఇప్పటికే నటించారు వీరిద్దరు. కానీ ఇద్దరు మెగా హీరోస్ ను ఒకే ఫ్రేమ్ లో చూపించే సీన్ మాత్రం ఉండదు. ఇప్పుడు ప్రతిపాదనల్లో ఉన్న కొత్త ప్రాజెక్టులో రామ్ చరణ్ హీరో కాగా.. బన్నీతో వాయిస్ ఓవర్ చెప్పిస్తారట. శాండల్ వుడ్ లో ధృవ సర్జా మూడేళ్ల క్రితం వచ్చిన మూవీ బహద్దూర్. ఈ మూవీకి పునీత్ రాజ్ కుమార్ ఇచ్చిన వాయిస్ బాగా ప్లస్ అయింది. ఈ కన్నడ బహద్దూర్ ను తెలుగులో రీమేక్ చేయాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ భావిస్తున్నారు.

రామ్ చరణ్ ను హీరోగా పెట్టి మూవీ తెరకెక్కించే ఆలోచన చేస్తుండగా.. వాయిస్ ఓవర్ ను తన కుమారుడు అల్లు అర్జున్ తో చెప్పించాలని చూస్తున్నారట అరవింద్. స్క్రీన్ పై కలిసి కనిపించపోయినా.. మరోసారి రామ్ చరణ్- అల్లు అర్జున్ కాంబినేషన్ అనగానే ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News