ఇష్టపడకపోయినా చూసినందుకు థ్యాంక్స్

Update: 2017-06-25 05:03 GMT
మెగా హీరో అల్లు అర్జున్ ఇప్పుడు తన కెరియర్ లో హెచ్చు దశలో ఉన్నాడు. యూత్ కు మాత్రమే నచ్చే హీరోగా కాకుండా ఫ్యామిలి ప్రేక్షకులుకు కూడా నచ్చే హీరోలా మారాడు. అందుకే ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కడకు వెళ్ళి మాట్లాడినా కొంచెం ఆలోచించి నేర్పుగా మాట్లాడటం నేర్చుకొన్నాడు. కొద్ది కాలం కిందట అనాలోచనగా చెప్పిన ఒక మాటకు పెద్ద మొత్తంలో యాంటీ ఫాన్స్ ను సంపాదించాడు. నేను ఏ ఉద్దేశ్యం తో అన్నానో అని ఎన్నిసార్లు వివరించడానికి ప్రయత్నం చేసిన నష్టమే జరిగింది. మన అభిమానులు ఇప్పుడు ఒక ప్రేక్షకులుగా సినిమాలు చూడటం మానేసి చాలాకాలం అయింది. మన అభిమాన హీరో సినిమా మనం చూద్దాం వేరే హీరో సినిమా ఎలా ఉన్న అంత బాగాలేదు అని ప్రచారం చేద్దాం ఇలా నడుస్తోంది.

అటువంటి కొన్ని సందర్భాల తరువాత భారీ అంచనాలు నడుమ విడుదలైన సినిమా దువ్వాడ జగన్నాధం. జూన్ 23 న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతో నడుస్తోంది. అందుకు అల్లు అర్జున్ స్పందిస్తూ.. “నేను మీలో కొంతమందికి నచ్చకపోయినా నా సినిమాను చూసి నన్ను ఇంతవాడిని చేసినందుకు థ్యాంక్స్. నన్ను ఇష్టపడ్డా.. ఇష్టపడకపోయినా.. నా సినిమా చూసినందుకు థ్యాంక్స్. అలాగే అభిమానులుకు ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులకు చాలా  కృతజ్ఞతలు” అని చెప్పాడు. ప్రతి మాటా తూకం వేసినట్లు మాట్లాడి ముగించాడు. స్టైలిష్ స్టార్ నటించిన దువ్వాడ జగన్నాధం సినిమా ఇప్పుడు థియేటర్లో విడుదలై విజయం కోసం పోరాడుతుంది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అందించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News