300 కోట్లు లూటీ చేయటమే పవన్ లక్ష్యమా?

Update: 2017-03-22 10:20 GMT
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విమర్శల జోరు అంతకంతకూ పెరుగుతోంది. తన తాజా చిత్రం కాటమరాయుడు చిత్రంతో రూ.300 కోట్ల దోపిడీకి పథకం వేసినట్లుగా  అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం  ఆరోపించిన‌ట్లు ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇటీవ‌లే ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ‘ సినిమా విడుదలైన మొదటి రెండు వారాలకు టికెట్ల ధరల్నిపెంచి ప్రేక్షకులను రూ.300 కోట్లు దోపిడీ చేసేందుకు పథకం పన్నారు’’ అని అఖిల భారత సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం తీవ్రంగా ఆరోపించినట్లుగా సదరు మీడియా కథనం పేర్కొంది. ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే ప్రేక్షకులకు రూ.10 నేల టికెట్టు రూ.50కు.. రూ.50 బాల్కనీ టిక్కెట్టు రూ.200లకు పెంచి దోపిడీ చేస్తున్నారంటూ సంఘం అధ్యక్షుడు జీఎల్ నర్సింహ్మారావు మండిపడిన‌ట్టు అందులో పేర్కొన్నారు.

తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎల్ నర్సింహ్మారావు మాట్లాడుతూ.. పవన్ దోపిడీకి ప్రభుత్వాలు మద్దతు పలకటం దారుణమన్నారు. టికెట్ల ధరను పెంచి హీరోగా ప్రజలను దోచుకునే జనసేన అధ్యక్షుడు ప్రజాసేవ పేరుతో ప్రజల్లోకి ఎలా వస్తారని, త‌న న చ‌ర్య‌ను ఎలా స‌మ‌ర్థించుకుంటార‌ని నిల‌దీశారు. హైకోర్టు తీర్పును వక్రీకరించి.. అక్రమంగా నేల టిక్కెట్లను పెంచేసి  దోపిడీకి రాజమార్గం వేసుకున్నట్లుగా ఆరోపించారు.

ప్రజలను దోపిడీ చేసే సినిమాలు ఎవ‌రివైనా స‌రే బహిష్కరించాలన్న ఆయన.. ప్రేక్షకులు కాటమరాయుడి సినిమాను మొదటి రెండు వారాలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సినిమాను చూసినవారు ఎవరైనా.. టికెట్లను జాగ్రత్తగా దాచి ఉంచితే.. సంబంధిత చిత్ర యూనిట్ పైన కేసులువేసి టిక్కెట్లు డబ్బుల్ని వసూలు చేయనున్నట్లుగా వెల్లడించారు. తాజా అక్రమ దోపిడీపై మా సంఘం సభ్యులు.. హీరోలు స్పందించకుంటే వారికి కూడా తగిన గుణ‌పాఠం చెబుతామన్నారు. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News