ఎందుకీ టాం అండ్ జెర్రీ ఆటలు?

Update: 2019-12-10 01:30 GMT
మహేష్ -బన్నీ సంక్రాంతికి రిలీజ్ విషయంలోనే కాదు ప్రమోషన్స్ లోనూ పోటీ పడుతూ ఒకే రోజు సినిమా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని రెచ్చ గొడుతున్నారు. అవును మహేష్ సినిమా నుండి పలనా రోజు టీజర్ అంటే సరిగ్గా అదే రోజు ఓ గంట ముందు బన్నీ సినిమా నుండి సాంగ్ రిలీజ్ అంటూ అప్డేట్ బయటికొస్తుంది. పలనా రోజు బన్నీ టీజర్ గ్లిమ్ప్స్ అనగానే మహేష్ సినిమా నుండి సాంగ్ వస్తోంది.

రిలీజ్ కి ఇంకా నెల ఉండటంతో ప్రమోషన్స్ తో రెండు సినిమాలు మాంచి స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఒకే రోజు ఎందుకీ పోటీ ప్రమోషన్స్ అనేది అటు సినీ అభిమానులకు ఇటు ఇండస్ట్రీ వర్గానికి అర్థం అవ్వట్లేదు.

నిజానికి ఇది తెలియక జరుగుతుందా తెలిసే కావాలని పంతానికి దిగుతున్నారా అనేది తెలియడం లేదు కానీ ఇద్దరు స్టార్ హీరోలు తమ పోటీ ప్రమోషన్స్ తో ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రక్రియ మాత్రం జరుగుతుంది. మరి ఇదే కంటిన్యూ అయితే ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఘర్షణ జరగడం ఖాయం అనిపిస్తుంది.
Tags:    

Similar News