సుల్తాన్ ను పడగొట్టిన అక్షయ్

Update: 2017-05-28 12:16 GMT
మన దేశం లో సినిమా​ను​​ ఎలా చూస్తారో టి‌వి రంగాన్ని కూడా అలానే ఆదరిస్తారు. ఒక సినిమా విడుదలైన కొద్ది నెలలు గడవగానే ఆ సినిమా టి‌వి లో వచ్చేస్తుంది ఇప్పుడు​. ​ఈ పద్దతి కూడా బాక్స్ ఆఫీసు కలెక్షన్లు లాంటిదే. అయితే ఇక్కడ దీన్ని టిఆర్పి రేటింగ్స్ అంటారు. అక్షయ్ కుమార్ ఈ ఏడాది మొదటిలో నటించిన జాలీ LLB 2 టి‌వి ప్రీమియర్ ఇప్పుడు సదరు టిఆర్పిల విషయంలో రచ్చ చేస్తోంది.

సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' అన్నిటికన్నా టి‌వి రేటింగ్ లో ముందంజలో ఉండేది. ఇప్పుడు అక్షయ్ కుమార్ జాలీ LLB 2 సుల్తాన్ ఆ​ రికార్డు బద్దలుకొట్టింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కూడా గొప్ప విజయం సాదించింది. బాలీవుడ్ ఫిల్మ్ ఫ్రాంఛైజీ లో వచ్చిన అన్నీ సినిమాలతో పోల్చిచూస్తే జాలీ LLB 2  సుమారుగా 120 కోట్లు కలెక్షన్లు తో గొప్ప విజయం పొందింది. అలానే టి‌వి లో కూడా 3.83 రేటింగ్ లో మొదటి స్థానం సాధించింది. సుల్తాన్ – 3.32,  వరుణ్ ధావన్ దిషూమ్ సినిమా 2.79, ది జంగిల్ బుక్ – 2.39, కాబిల్ – 2.37 ఆ తరవాత స్థానాలలో ఉన్నాయి.
​​
జాలీ LLB 2 లో అక్షయ్ ఒక మంచి లాయర్ గా న్యాయ౦ కోసం తను వాదించే పద్దతితో అందరికీ తెగ నచ్చేసాడు. కొన్ని సినిమాలు టి‌వి లో పెద్ద హిట్ అవుతాయి. ఉదాహరణకు మన తెలుగులో అతడు.. జై చిరంజీవా అలా హిట్ అయినవే. అందరి ఆలోచనలు తగ్గట్లు కొన్ని సినిమాలు ఉంటాయి అవి టి‌వి లో బంపర్ హిట్ అవుతుంటాయి. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News