ఫోటో స్టోరి: ఫార్టీ ప్లస్ అనేవాళ్ల నోళ్లు కుట్టేయాలి

Update: 2016-10-20 15:30 GMT
బాలీవుడ్ సుందరి ఐశ్వర్యా రాయ్ సంచలనాలకు రెడీ అయిపోయింది. ఇప్పటికే యే దిల్ హై ముష్కిల్ టీజర్.. ట్రైలర్ తో అభిమానుల గుండెల్లో వేడి రగిలించేసిన ఈ భామ.. మళ్లీ తన ఇరవైల నాటి పరువాలను గుర్తు చేస్తోంది. ఏళ్ల క్రితం సినిమాలు చేయడం మానేసిన ఐష్ రీ ఎంట్రీపై పెట్టుకున్న అంచనాలను.. జాజ్బా నిలబెట్టలేకపోయింది.

తాము ఆరాధించే ప్రపంచ అందగత్తెను అలాంటి సీరియస్ రోల్ లో.. అది కూడా ఓ చిన్నారికి అమ్మగా చూసేందుకు ఫ్యాన్స్ కు మనసొప్పలేదు. ఒక్క సినిమాతోనే తన తప్పేంటే పూర్తిగా తెలుసుకున్న ఐశ్వర్య.. మరుసటి సినిమాకే మొత్తం మార్చేసింది. రణబీర్ కపూర్ తో కలిసి సినిమాలో సెగలు పుట్టించడమే కాదు.. ఫోటో షూట్స్ లో మరింతగా రెచ్చిపోతోంది. బెడ్ రూమ్ సీన్స్ లో చేసేందుకు లేని అభ్యంతరాలు.. బ్రా లోపలి అందాలు చూపించడం ఎందుకు అనుకుందేమో కానీ.. 42 ఏళ్ల వయసులోనూ క్లీవేజ్ పరువాలను ప్రదర్శనకు పెట్టేసి ఫోటోలకు పోజులు ఇచ్చేస్తోంది.

ఇలా చూశాక ఐశ్వర్య వయసు 42 ప్లస్ అనుకోవడమే కాదు.. అనడం కూడా అంత కరెక్టే కాదేమో. ఇక అభిమానులైతే మరోసారి మా ఐశ్వర్యానికి వయసుతో సంబంధం లేదంటూ సంబరపడిపోతున్నారు. అయినా.. అందరూ తన నుంచే కోరుకునే అసలైన ఐశ్వర్యం ఏంటో అర్ధం చేసుకుని.. అటు వైపు నుంచే నరుక్కొచ్చేస్తున్నట్లుగా ఉంది ఐశ్వర్యారాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News