వెండితెరపై ఏజ్ గ్యాప్ హీరో హీరోయిన్లు

Update: 2017-04-29 00:30 GMT
సిల్వర్ స్క్రీన్ పై హీరో హీరోయిన్ల పెయిర్ చాలా ముఖ్యం. మెయిన్ రోల్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండితేనే సినిమా ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో మేకర్స్ ట్రెండ్ తో పాటు.. వారి వయసులను కూడా పరిగణలోకి తీసుకుంటారు. కానీ కొన్ని సార్లు మాత్రం హీరో హీరోయిన్ల మధ్య వయసు అంతరం అసలేమాత్రం కౌంట్ లోకి రాదు.

రీసెంట్ గా ఖైదీ నంబర్ 150 మూవీలో మెగాస్టార్ చిరంజీవి- కాజల్ అగర్వాల్ జోడీ కట్టారు. వీరిద్దరి మధ్య 30 ఏళ్ల అంతరం ఉంది. గతేడాది సోగ్గాడే చిన్ని నాయన మూవీలో నాగార్జున- లావణ్య త్రిపాఠిలు సందడి చేశారు. వీరి ఏజ్ గ్యాప్ 20 ఏళ్లు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న రోబో సీక్వెల్ 2.0మూవీలో రజినీకీ జోడీగా అమీ జాక్సన్ నటిస్తోంది. వీరి వయసుల మధ్య తేడా 41 సంవత్సరాలు. సుభాష్ చంద్రబోస్ లో వెంకటేష్ తో జెనీలియా రొమాన్స్ చేసినప్పుడు.. వీరి వయో బేధం 27 ఏళ్లు.

ఇక శ్రీదేవి సంగతి తెలిసిందే. ఏన్నాఆర్ తో ప్రేమాభిషేకం చిత్రంలో శ్రీదేవి నటించగా.. వీరి ఏజ్ గ్యాప్ 40 ఏళ్లు. వేటగాడులో ఎన్టీఆర్ తో శ్రీదేవి జత కట్టగా.. వీరి వయో అంతరం కూడా 40 ఏళ్లే. సింగ్ ఈజ్ బ్లింగ్ మూవీలో అక్షయ్ కుమార్.. అమీ జాక్సన్ లు కలిసి నటించగా.. వీరికి వయసులకు 25 ఏళ్ల తేడా ఉంది. సల్మాన్ ఖాన్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రంలో సోనమ్ తో రొమాన్స్ చేయగా.. వీరి వయసుల తేడా 20 ఏళ్లు.

అజయ్ దేవగన్- సాయేషాలు శివాయ్ లో కలిసి నటించగా.. వీరి ఏజ్ గ్యాప్ 28 ఏళ్లు. ఇక అందరికంటే ఎక్కువ వయసు తేడాతో నటించిన రికార్డ్ అమితాబ్ బచ్చన్ ది. నిశ్శబ్ద్ మూవీలో ఈయనకు జియా ఖాన్ కు మధ్య వయసు తేడా ఏకంగా 45 సంవత్సరాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News