ఫస్ట్ లుక్: ఐష్ ముక్కుతో కుర్రాడు రొమాన్స్

Update: 2016-08-29 16:58 GMT
మాజీ మిస్ వరల్డ్.. టాప్ హీరోయిన్ అయిన ఐశ్వర్య ర్యాయ్ ఈ మధ్యనే సినిమాల్లోకి బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చేసింది. 40ప్లస్ ఏజ్ లో ఐశ్వర్య తిరిగి సినిమాల్లో చేసినా.. అన్నీ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే చేస్తుందని అంతా అనుకున్నారు. రీఎంట్రీ తర్వాత ఇప్పటివరకూ వచ్చిన సినిమాలు ఆ బాపతుగానే ఉన్నాయి.

ఇలాంటి సినిమాలు రీఎంట్రీకి ప్రిపరేషన్ మాత్రమే అని.. మళ్లీ అసలు అందాల ఐష్ ను త్వరలో చూడబోతున్నామనే విషయం ఇప్పుడో పోస్టర్ తో తేలిపోయింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'యే దిల్ హై ముష్కిల్'కు ఇప్పుడు ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. యంగ్ హీరో రణబీర్ కపూర్.. అనుష్క శర్మతోను.. ఐశ్వర్యారాయ్ తోను రొమాన్స్ చేసేస్తున్నాడు. పోస్టర్ చూడగానే ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్ధమవుతోంది కానీ.. ఈ పోస్టర్ లో కుర్రాడితో ఫార్టీ ప్లస్ ఐశ్వర్య రొమాన్స్ చేస్తుండడం.. అందరినీ అలర్ట్ చేసేసింది.

ముక్కు ముక్కు రాసుకుంటూ.. తన్మయత్వంలో మునిగిపోయిన ఐశ్వర్యారాయ్.. రణబీర్ కపూర్ లు మనకు ఈ ఫస్ట్ లుక్ లో కనిపిస్తారు. ఇక ఈ ఏడాది దీపావళికి ఫస్ట్ లు క్ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు నిర్మాతలు.
Tags:    

Similar News