చరణ్‌ విలన్ ను అరెస్టు చేశారంటగా...

Update: 2016-08-27 13:33 GMT
'బ్రూస్ లీ' సినిమాలో విలన్ సంపత్ కొడుకుగా నటించిన తమిళ హీరో అరుణ్‌ విజయ్ గుర్తున్నాడా? మనోడు ఇప్పుడు చెన్నయ్ లో నిజంగానే అరెస్టయ్యాడు. అది కూడా ఫుల్లుగా పోలీస్ జీపునే గుద్దేయడంతో మనోడికి అరెస్టు తప్పింది కాదు.

శుక్రవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొని తన భార్యతో కలిసి తిరిగి వస్తున్న సమయంలో చెన్నై నుగంబాక్కం పోలీస్ స్టేషన్ దగ్గర.. ఏకంగా ఆగి ఉన్న పోలీస్ జీపును ఢీకొట్టాడట. పెద్దగా సౌండ్ రావడంతో పోలీసులు బయటకు వచ్చి చూసేసరికి.. తమ వాహనాన్ని ఒక లగ్జరీ కారు ఢీకొని ఉండటం గమనించారు. తీరా డ్రైవింగ్ సీట్లో చూస్తే హీరో అరుణ్ విజయ్. ఫుల్లుగా తాగేసి ఉన్నాడట. వెంటనే మనోడిని డ్రంక్ డ్రైవ్ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ ఘటనపై ఏవాత్ తమిళనాడులో ఒక క్లారిటీ అనేదే లేదు. ఒక్కో మీడియాలో ఒక్కోలా వినిపిస్తోంది.

సర్లేండి.. ఏదేమైనా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నేరం. సెలబ్రిటీలు అయినా మామూలువారైనా.. తాగేసి కారు నడపకూడదు.
Tags:    

Similar News