నయనతారను పొగిడేసిన అమీర్ ఖాన్

Update: 2016-06-13 15:30 GMT
ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న ఉడ్తాపంజాబ్ చిత్రానికి అనురాగ్ కశ్యప్ నిర్మాత. విభిన్నమైన చిత్రాలకు దర్శకత్వం వహించడం అనురాగ్ స్పెషాలిటీ. ప్రస్తుతం రమన్ రాఘవ్ 2.0 అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా.. 'సచ్చా బేహుదా' అంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశాడు అనురాగ్ కశ్యప్.

1960ల్లో ముంబైలో సీరియల్ కిల్లర్ రమన్ రాఘవ్ స్ఫూర్తితో సాగుతుంది ఈ చిత్రం. బడ్జెట్ పరిమితుల కారణంగా.. బయోపిక్ మాదిరిగా కాకుండా.. అలాంటి కిల్లర్ ఇప్పటి సమాజంలో ఉంటే అనే కాన్సెప్ట్ తో రమన్ రాఘవ్ సాగుతుంది. ఇప్పుడు రిలీజ్ అయిన 'బేహుదా' పాట కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా లిరిక్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ పాటను నయనతార అనే కొత్త సింగర్ పాడింది. ఆమె వాయిస్ ఈ పాటకు ప్రాణం పోసిందని చెప్పచ్చు. కిల్లర్ మనస్తత్వాన్ని అద్దం పట్టేలా ఉన్న ఆ లిరిక్ తగినట్లుగా వాయిస్ లో బేస్ మార్చుకుంటూ పాడింది నయనతార.  

బేహుదా సాంగ్ ను చూసిన అమీర్ ఖాన్ థ్రిల్ అయిపోయాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెబుతూ ఓ ట్వీట్ కూడా చేశారు అమీర్. 'మంచి పాట అనురాగ్. కొత్త సింగర్ నయనతార చాలా అద్భుతంగా పాడింది' అంటూ ట్వీట్ చేశాడు ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. అమీర్ చేసిన ఒక్క ట్వీట్ తో నయనతార ఇప్పుడు సెలబ్రిటీ సింగర్ అయిపోయింది.
Tags:    

Similar News