09 ఆగస్టు మహేష్ బర్త్ డే. ఇదే రోజు దగ్గుబాటి రానాకి బిగ్ డే. గత సంవత్సరం ఇదే రోజున హీరో రానా తన చిరకాల స్నేహితురాలు మిహీకా బజాజ్ ని పెళ్లాడారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో సన్నిహిత వేడుకలో ప్రయివేట్ ఎఫైర్ తరహాలో వివాహం జరిగింది. ఈ వివాహానికి ఎంపిక చేసిన కొద్దిమంది కుటుంబ సభ్యులు స్టార్ కపుల్స్ మాత్రమే హాజరయ్యారు. రానా స్నేహితులు రామ్ చరణ్.. కజిన్ నాగచైతన్య కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ రోజు రానా - మిహీకా మొదటి వివాహ వార్షికోత్సవం. ఈ ప్రత్యేక సందర్భంలో మిహీకా ఇన్ స్టా వేదికగా తమ పెళ్లి ఫోటోని షేర్ చేశారు.
``వార్షికోత్సవ శుభాకాంక్షలు నా ప్రియతమా! ఇది అత్యంత సంతోషకరమైన సంవత్సరం! ప్రపంచం ఎండ్ అయ్యే వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మీరు అద్భుతమైన వాడిగా ఉన్నందుకు ధన్యవాదాలు !! ఇక్కడ ఇంకా జీవితకాలం ఉంది`` అంటూ ఆనందం వ్యక్తం చేశారు మిహీక. ఇది కౌంట్ డౌన్.. మైలైఫ్ మైలవ్ అనే హ్యాష్ ట్యాగ్ లను మిహీక జోడించారు.
ఇక రానా ఇటీవలే అమెరికా వెళ్లారని ప్రచారమైంది. ప్రస్తుతం అతడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రానా నటించిన విరాటపర్వం రిలీజ్ కి రానుంది. తదుపరి హిరణ్యకశిప సహా పలు భారీ చిత్రాల్లో రానా నటిస్తున్నారు.