ఆ ఒక్కడికి 15 వసంతాలు పూర్తి

Update: 2018-01-15 07:55 GMT
మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ అయిపోయాడు. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా రాజకుమారుడు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆరంభం నుంచే టాలీవుడ్ యువరాజు. అయితే.. మహేష్ కు సూపర్ స్టార్ ఇమేజ్ ఆపాదించిన చిత్రం ఒక్కడు.

2003లో విడుదల అయిన ఒక్కడు.. మహేష్ కెరీర్ లో 7వ చిత్రం కాగా.. అంతకు ముందు రెండు ఫ్లాప్స్ తర్వాత వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. మహేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయింది. ఇవాల్టితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 15 సంవత్సరాలు పూర్తి కావడంతో.. మహేష్ అభిమానులు 15ఇయర్స్ ఆఫ్ ఒక్కడు అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ చేసేస్తున్నారు. మహేష్ బాబు.. జోడీగా నటించిన భూమిక అందం.. గుణశేఖర్ డైరెక్షన్.. ఎంఎస్ రాజు నిర్మాణ విలువలు.. మణిశర్మ పాటలు ఇలా ఎన్నో అంశాలు ఒక్కడు సక్సెస్ లో కీలక పాత్ర వహించాయి.

మరోవైపు ఒక్కడు మూవీలో దాదాపు 2 కోట్ల రూపాయలో చార్మినార్ సెట్ నిర్మించి.. చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఆ సెట్ చుట్టుపక్కల తీయడం.. ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఒక్కడు తర్వాతే ఇలా భారీ సెట్టింగులలో మెజారిటీ పార్ట్ షూటింగ్ అనే ట్రెండ్ మొదలైంది. ఈ చిత్రం 8 కేటగిరిల్లో నంది అవార్డులను గెలుచుకోగా.. ఫిలింఫేర్.. సినీ మా అవార్డులలో బెస్ట్ యాక్టర్ పురస్కారాన్ని అందుకున్నాడు మహేష్.
Tags:    

Similar News