ఆల్బమ్ టాక్: ముచ్చటగా రెండే

Update: 2019-02-23 12:36 GMT
మాములుగా నందమూరి హీరో సినిమా అంటే రెగ్యులర్ గా ఉండే కమర్షియల్ అంశాలతో పాటు కనీసం ఐదు లేదా ఆరు పాటలు ఉండటం ఆనవాయితి. కాని కళ్యాణ్ రామ్ మాత్రం ఈ ట్రెండ్ కి ఎదురీది 118 ద్వారా కొత్త ప్రయత్నం ఏదో చేసాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చిన ఈ ఆల్బంలో కేవలం రెండే పాటలు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అందులో ఒకటి చందమామే చేతికందే ఇంతకు ముందే రిలీజవ్వగా మరొకటి పాదాలు నీ దారే పాటను దాంతో పాటు జత చేర్చారు.

మొదటి సాంగ్ మేల్ వాయిస్ తో యాజిన్ నిజార్ పాడగా రామాంజనేయులు సాహిత్యం సమకూర్చారు. రెండోది నూతన మోహన్ ఆలపించగా కళ్యాణ్ త్రిపురనేని లిరిక్స్ అందించారు. రెండు బీట్ తో కూడిన మంచి మెలోడీస్ గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక మూడో ట్రాక్ రెండు నిమిషాల పాటు సాగే థీమ్ మ్యూజిక్ ని జోడించారు. ఈ మూడు ట్రాక్స్ తోనే ఆల్బంని ముగించారు

కళ్యాణ్ రామ్ సినిమాలో ఇలా కేవలం రెండే పాటలు ఉండటం ఆశ్చర్యమే. శేఖర్ చంద్ర అందుకే శ్రద్ధ తీసుకుని గుర్తుండిపోయే ట్యూన్స్ కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. కెవి గుహన్ మొదటిసారి తెలుగులో దర్శకత్వం వహిస్తున్న 118కు మహేష్ కోనేరు నిర్మాత. మార్చ్ 1 విడుదలకు రంగం సిద్ధమయ్యింది. థ్రిల్లర్ జానర్ లో రూపొందిన 118 ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. శాలిని పాండే నివేదా థామస్ హీరొయిన్లు నటించిన ఈ 118 మీద అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి.



Full View

Tags:    

Similar News