కేశవపై అల్లు అర్జున్ ఏమన్నాడు?

Update: 2017-05-14 05:04 GMT
నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కేశవ. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 19న గ్రాండ్ రిలీజ్ కానుంది. వరుస హిట్స్ తో ఊపుమీదున్న నిఖిల్.. స్వామిరారాతో ఆకట్టుకున్న దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్ కావడంతో.. అంచనాలతో పాటు ఇన్ సైడ్ రిపోర్టులు చాలా పాజిటివ్ గా ఉన్నాయి. 

మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ తనకు ఈ సినిమా గురించి చెప్పాడంటూ చిన్నపాటి షాక్ నే ఇచ్చాడు. 'కేశవ టీజర్ ను చూశారా అంటూ మొదటగా అల్లు అర్జున్ నాకు ఫోన్ చేశాడు. తను చెప్పాకే కేశవ టీజర్ ను చూశాను. ఎంతో బాగా తీశారు. ఆశ్చర్యపోయాను. బన్నీ కూడా తనకు ఈ టీజర్ బాగా నచ్చిందని చెప్పాడు' అన్నాడు గుణశేఖర్. 

విభిన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్న నిఖిల్ ని చూస్తుంటే.. అసుల హ్యాపీడేస్ లో కుర్రాడేనా అనిపిస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు గుణశేఖర్. అప్పుడప్పుడూ కమర్షియల్ సినిమాలు చేసినా.. ఎక్కువగా ఇలాంటి కొత్త తరం సినిమాలే చేయమని సలహా ఇచ్చాడు కూడా. మరోవైపు కేశవ హీరోయిన్ తెలుగమ్మాయి రీతు వర్మ.. తెలుగులో మాట్లాడడాన్ని అభినందించిన గుణ శేఖర్.. మరింత స్పష్టంగా తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చాడు.

Similar News