వేర్ ఈజ్ అనూప్ రూబెన్స్..?

కొత్త సంగీత దర్శకులు ఎంతమంది వచ్చినా వారి టాలెంట్ గుర్తించడానికి చాలా టైం పడుతుంది.

Update: 2024-05-10 05:51 GMT

ఒక సినిమా సక్సెస్ అయ్యింది అంటే అందులో అన్ని యాస్పెక్ట్స్ బాగా కుదిరినట్టు లెక్క. ముఖ్యంగా సినిమా ను రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేది సంగీతం మాత్రమే. టీజర్, ట్రైలర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో సినిమాలోని సాంగ్స్ అంతే ప్రాధాన్యత తెచ్చుకుంటాయి. సాంగ్స్ బాగుంటే సినిమా 50 పర్సెంట్ హిట్ అయినట్టే అని చెప్పుకుంటారు. అయితే ఇండస్ట్రీలో హీరోయిన్స్ మాదిరిగానే సంగీత దర్శకుల కొరత కూడా బాగా కనిపిస్తుంది. కేవలం ఇద్దరు ముగ్గురుతోనే రిపీటెడ్ గా సినిమాలు చేస్తుంటారు.

కొత్త సంగీత దర్శకులు ఎంతమంది వచ్చినా వారి టాలెంట్ గుర్తించడానికి చాలా టైం పడుతుంది. ఇక కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ కొంత కాలం కెరీర్ బాగానే కొనసాగించినా ఆల్ ఆఫ్ సడెన్ కెరీర్ లో వెనుకబడిపోతారు. అలాంటి వారి గురించి చెప్పుకుంటే అనూప్ రూబెన్స్ లిస్ట్ లో ఉంటాడు. జై సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన అనూప్ రూబెన్స్ తన మార్క్ మెలోడీ మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు అనూప్ రూబెన్స్. ఆయన మ్యూజిక్ చేస్తున్నాడు అంటే ఆల్బం పక్కా హిట్ అనే టాక్ తెచ్చుకున్నాడు. యువ హీరోలతోనే కాదు స్టార్స్ తో కూడా పనిచేసిన అనూప్ రూబెన్స్ ఎందుకో ఈమధ్య అసలు కనిపించడం లేదు. 2022 లో జిన్నా సినిమా చేసిన అనూప్ రూబెన్స్ ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ తో సూపర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కినేని హీరోలకు అనూప్ రూబెన్స్ ది బెస్ట్ మ్యూజిక్ అందిస్తూ వచ్చాడు.

Read more!

తనను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సినిమాకు తన పరంగా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూ వచ్చాడు అనూప్. రెండేళ్ల గ్యాప్ తర్వాత అనూప్ రూబెన్స్ ఆది సాయి కుమార్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడని తెలుస్తుంది. కృష్ణ ఫ్రం బృందావనం సినిమాతో మరో అటెంప్ట్ చేస్తున్నాడు డైరెక్టర్ వీరభద్రం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించడం విశేషం. ఆల్రెడీ ఆది సాయి కుమార్ కు అనూప్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. మరి ఈ సినిమాతో అనూప్ తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News