ఆ అకౌంట్ బన్నీదేనా? అసలేం జరుగుతోంది?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇన్ స్టాలో ఓ పర్సనల్ అకౌంట్ ను మెయింటైన్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-17 10:54 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇన్ స్టాలో ఓ పర్సనల్ అకౌంట్ ను మెయింటైన్ చేస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ అకౌంట్ లో కేవలం సెలబ్రిటీలు మాత్రమే ఉంటారని, వారితో బన్నీ అక్కడ ఇంటరాక్ట్ అవుతుంటారని అంతా చెబుతుంటారు. సోషల్ మీడియాలో అన్నీ గమనిస్తారని అంటుంటారు.

అయితే ఇప్పుడు @bunny_boy_private అనే పేరుతో ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కనపడడం చర్చనీయాంశంగా మారింది. ఆలోచించకుండా యాదృచ్ఛిక విషయాలు అంటూ బయోలో రాసి ఉంది. అదే సమయంలో ఆ అకౌంట్ ను హీరోయిన్ సమంత, రానా దగ్గుబాటి సహా పలువురు సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు.

దీంతో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. నిజానికి.. అల్లు అర్జున్ మరో ఇన్ స్టా అకౌంట్ ను యూజ్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా... అకౌంట్ ఐడీ తెలియదు. బన్నీ వాడడం మాత్రం నిజమేనని అంటున్నారు. అయితే ఇప్పుడు @bunny_boy_private అనే పేరుతో ఉన్న అకౌంట్ అల్లు అర్జున్ దేనని చెబుతున్నారు.

ఫ్యాన్స్ మాత్రం కాదమోనని అంటున్నారు. మొత్తానికి ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అండ్ టీమ్ స్పందించలేదు. జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి బన్నీ టీమ్ రెస్పాండ్ అయితే బాగుంటుందని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా పుష్ప-2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ మూవీతో సరికొత్త రికార్డులు సృష్టించారు. మరిన్ని రికార్డులు బ్రేక్ చేశారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరద పారించారు. నిర్మాతలకు లాభాల వర్షం కురిపించారు. ఫస్ట్ పార్ట్ కు మించిన హిట్ సాధించారు.

ఆ తర్వాత ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకు మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. వేరే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగాతో బన్నీ సినిమాలు చేయనున్నారని టాక్. చూడాలి మరేం జరుగుతుందో..

Tags:    

Similar News