లెనిన్ తర్వాత అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ ఇదే..!

అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న హిట్‌ దక్కింది. అఖిల్‌కి మొదటి బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ 'లెనిన్‌'తో దక్కడంతో ఫ్యాన్స్‌తో పాటు, ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా కూడా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

Update: 2026-07-21 06:12 GMT

అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న హిట్‌ దక్కింది. అఖిల్‌కి మొదటి బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ 'లెనిన్‌'తో దక్కడంతో ఫ్యాన్స్‌తో పాటు, ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా కూడా ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. వరుసగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. తాజాగా సినిమా విజయోత్సవ వేడుకలు వైభవంగా జరిగింది. నాగార్జునతో పాటు నాగ చైతన్య సైతం ఈ కార్యక్రమానికి హాజరు అయ్యాడు. అఖిల్‌ కు దక్కిన విజయాన్ని నాగార్జున, నాగ చైతన్య సెలబ్రేట్‌ చేసుకోవడం అక్కినేని ఫ్యాన్స్‌కి కన్నుల పండుగగా అనిపించింది. ముగ్గురు అక్కినేని హీరోలను సింగిల్‌ ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ మనం ఫ్రేమ్‌ను తెగ షేర్ చేస్తున్నారు. అఖిల్‌ లెనిన్‌తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్‌ మరో హిట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నాగార్జున 100వ సినిమా అప్‌డేట్‌...

ఈ ఏడాదిలోనే అక్కినేని నాగార్జున 100వ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలని అంతా కోరుకుంటున్నారు. నాగార్జున గత కొన్నాళ్లుగా ఆశించిన స్థాయిలో హిట్స్‌ను అందించలేక పోయాడు. పైగా హీరోగా కాకుండా కూలీ, కుబేర సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేయడం ద్వారా అభిమానులు కాస్త అసహనంతో ఉన్నారని టాక్‌. వారిని సంతృప్తి పర్చడం కోసం నాగార్జున తన 100వ సినిమాతో సూపర్‌ హిట్‌ను కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే నాగార్జున 100వ సినిమా ప్రారంభం అయింది. అక్కినేని వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయింది. త్వరలోనే సినిమా నుంచి కీలక అప్‌డేట్‌ రాబోతుంది. ఇప్పటి వరకు సినిమాను ప్రకటించలేదు, కానీ త్వరలోనే నాగార్జున 100వ సినిమా గురించి అన్ని విషయాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

నాగ చైతన్య వృషకర్మ మూవీ రిలీజ్‌...

నాగార్జున 100వ సినిమాకు రా కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ విషయమై స్పష్టత ఉంది. కానీ సినిమా గురించిన ఎలాంటి అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో లేదు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా 2026లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. అందుకే ఫ్యాన్స్‌ ఈ సినిమా త్వరగా విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాదికి వాయిదా వేసే ఆలోచన అస్సలు చేయవద్దని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న వృషకర్మ సినిమాను సైతం ఇదే ఏడాది విడుదల చేయాల్సిందే అంటూ ఫ్యాన్స్‌ బలంగా కోరుకుంటున్నారు. నాగ చైతన్య ఇప్పటికే ఈ సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ 2026లోనే సినిమాను విడుదల చేయాలనే డిమాండ్‌ చేస్తున్నారు.

అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు...

తండేల్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన నాగ చైతన్య మరో వినూత్నమైన కథాంశంతో చేస్తున్న సినిమా వృషకర్మ. కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతన్న సమాచారం ప్రకారం నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బడ్జెట్‌ మూవీగా ఈ సినిమా నిలువబోతుందని అంటున్నారు. ఇప్పటికే సినిమాకి ఉన్న బజ్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ జీ5 నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ను ఏకంగా రూ.50 కోట్లకు కొనుగోలు చేసిందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి వృషకర్మ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్‌ బజ్‌ ఉంది. కనుక విడుదల విషయంలో ఆలస్యం చేయకుండా 2026లోనే విడుదల చేయాలని ఫ్యాన్స్ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సైతం 2026లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే ఒకే ఏడాదిలో ముగ్గురు అక్కినేని హీరోలు హిట్‌ కొట్టిన రికార్డ్‌ ఉంటుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి వారి కోరిక ఎంత వరకు తీరుతుంది అనేది చూడాలి.

Tags:    

Similar News