అఖిల్‌ 'లెనిన్‌' కి కలిసి వచ్చే అంశం..!

గతంలో కొన్ని సినిమాలకు ఓవర్‌ హైప్‌ కావడంతో సినిమా యావరేజ్‌గా ఉన్నప్పటికీ వసూళ్లు రెండో షో నుంచే డ్రాప్‌ అయ్యాయి.

Update: 2026-07-04 14:30 GMT

ఇది మహాభారతం... అంటూ కింగ్ నాగార్జున పవర్‌ ఫుల్‌ వాయిస్‌తో పవర్ ఫుల్‌ వాయిస్‌ ఓవర్ ఇచ్చిన 'లెనిన్‌' ట్రైలర్‌కి పాజిటివ్ రెస్పాన్స్‌ వచ్చింది. అఖిల్‌ అక్కినేని ఈ సారి హిట్ కొడతాను అంటూ చాలా బలంగా నమ్మకంగా చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యాయి. సినిమా గురించి ఎంత చెప్పినా... ప్రమోషన్స్‌తో ఊదరగొడుతున్నా కూడా పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అవుతుంది. కానీ భారీ హైప్‌ మాత్రం రావడం లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. సినిమాకు భారీ హైప్‌ రావడం వల్ల కొన్ని సార్లు మంచి జరిగినా ఎక్కువ సార్లు చెడు జరగడం మనం చూశాం. గతంలో కొన్ని సినిమాలకు ఓవర్‌ హైప్‌ కావడంతో సినిమా యావరేజ్‌గా ఉన్నప్పటికీ వసూళ్లు రెండో షో నుంచే డ్రాప్‌ అయ్యాయి. మీడియం రేంజ్ హైప్‌ ఉన్న సినిమాలకు మాత్రమే లాంగ్‌ రన్‌ వసూళ్లు నమోదు అవుతాయని పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది.

అఖిల్‌ లెనిన్‌ మూవీ రిలీజ్‌...

అఖిల్‌ 'లెనిన్‌' సైతం మీడియం రేంజ్ హైప్‌తో విడుదల కాబోతుంది. తక్కువ సమయంలోనే సినిమాను పూర్తి చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యం అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే 2025లోనే లెనిన్‌ను తెలుగు ప్రేక్షకులు చూసేవారు. కానీ అనుకోని కారణాల వల్ల ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యింది. జులై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లెనిన్‌ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్‌ బుకింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేశారు. అఖిల్‌ ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా మీడియా సమావేశాలు, స్పెషల్‌ చిట్‌ చాట్‌ షో లు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని లెనిన్‌ పై పడే విధంగా ప్లాన్‌ చేస్తున్నాడు. సినిమా గురించిన చర్చ అయితే సోషల్‌ మీడియాలో జరుగుతుంది. కానీ సినిమా ఆహా.. ఓహో అని మాత్రం పెద్దగా ప్రచారం జరగడం లేదు. సినిమాకు అదే కలిసి వచ్చే అంశం అని విశ్లేషకులు అంటున్నారు.

నిర్మాత నాగవంశీ కామెంట్స్‌...

సినిమాపై ఎలాంటి అంచనాలు లేకుండా ఓపెన్‌ మైండ్‌తో వెళ్తే కచ్చితంగా మినిమం ఉన్నా బాగుంది అనిపిస్తుంది. అదే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుని థియేటర్‌కి వెళ్తే.. మినిమం గా ఉంటే సినిమాను జనాలు తిరస్కరించే అవకాశం ఉంది. కనుక ఇదే స్టైల్‌లో పబ్లిసిటీ చేస్తూ లెనిన్‌ సినిమాను మెల్ల మెల్లగా ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నిర్మాత నాగవంశీ తన గత చిత్రాలకు చాలా అగ్రెసివ్‌గా పబ్లిసిటీ చేసిన విషయం తెల్సిందే. అయితే ఈసారి మాత్రం నాగవంశీ హడావిడి కనిపించడం లేదు. ఆయన కావాలని సైలెంట్‌గా ఉన్నాడా లేదంటే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆయనకు ఏమైనా గైడ్‌లైన్స్ వెళ్లాయా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైతేనేం లెనిన్‌ సినిమా విషయంలో మీడియాలో హడావిడి లేకుండా సింపుల్‌గా పబ్లిసిటీ జరుగుతుంది.

అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే...

అఖిల్‌ హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే పట్టుదలతో చాలా కాలం వెయిట్‌ చేశాడు. ఎట్టకేలకు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అఖిల్‌ ఇటీవల మాట్లాడుతూ ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే ఉద్దేశంతో ఇన్నాళ్లు వెయిట్‌ చేశాను, లెనిన్‌తో గట్టిగా కొట్టబోతున్నాం అని అన్నాడు. సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు మరే హీరో చేసినా సినిమాకు హైప్‌ భారీగా వచ్చేది. అఖిల్‌ చేసిన ఆ వ్యాఖ్యలను నెటిజన్స్ పెద్దగా పట్టించుకున్నట్లుగా అనిపించడం లేదు. అయితే అభిమానులు మాత్రం అఖిల్‌ మాటపై నమ్మకం ఉంచారు. లెనిన్‌తో అక్కినేని ఫ్యామిలీకి ఈ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్‌ పడబోతుందని నమ్మకంగా ఉన్నారు. లెనిన్‌ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా కీలక పాత్రల్లో శివాజీ, శరణ్య ప్రదీప్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. తమన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. మహాభారతం ఛాయలు ఉండే కథతో సాగే ఈ సినిమా అఖిల్‌ మాటను నిలబెడుతుందా, హైప్ లేకుండా సైలెంట్‌గా రాబోతున్న సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనేది చూడాలి.

Tags:    

Similar News