డెకాయిట్ బుకింగ్స్.. ఐదో రోజు పరిస్థితి ఎలా ఉందంటే..
కానీ ఈ సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సోమవారం కంటే మంగళవారం నాడు ఆడియన్స్ కౌంట్ పెరగడం చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.;
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తన బాక్సాఫీస్ సత్తాను మరోసారి నిరూపించుకుంటున్నారు. అతను నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ మొదటి వారం ముగుస్తున్నా వసూళ్ల పరంగా ఎక్కడా తగ్గడం లేదు. సాధారణంగా వీక్ డేస్‌లో సినిమాల బుకింగ్స్ తగ్గుముఖం పడుతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సోమవారం కంటే మంగళవారం నాడు ఆడియన్స్ కౌంట్ పెరగడం చిత్ర యూనిట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
సినిమాకు లభిస్తున్న మౌత్ టాక్ బాక్సాఫీస్ నెంబర్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అసలు విషయానికి వస్తే, ఐదో రోజైన మంగళవారం నాడు ‘డెకాయిట్’ వసూళ్లలో జంప్ కనిపించింది. బుక్ మై షో డేటా ప్రకారం, నాలుగో రోజు 53 వేల టిక్కెట్లు అమ్ముడవ్వగా, ఐదో రోజు ఆ సంఖ్య 61.39 వేలకు చేరుకుంది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా మొత్తం 6.22 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
వీక్ డేస్‌లో ఈ స్థాయిలో టిక్కెట్ల అమ్మకాలు పెరగడం ఒక పాజిటివ్ మూమెంట్. స్పోర్ట్స్ యాక్షన్ తరహాలోనే ఈ లవ్ అండ్ రివెంజ్ డ్రామాను కూడా ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారు.
డొమెస్టిక్ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్ లో కూడా అడివి శేష్ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం కేవలం కొన్ని రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. శేష్ కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ మార్క్ ని అందుకున్న చిత్రంగా ‘డెకాయిట్’ రికార్డు సృష్టించింది.
ఓవర్సీస్ ప్రేక్షకులకు శేష్ ఎంచుకునే థ్రిల్లర్ కథలపై ఉన్న నమ్మకం వసూళ్ల రూపంలో హైలెట్ అవుతోంది. అక్కడ లాంగ్ రన్‌లో ఈ సినిమా మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేసే దిశగా సాగుతోంది. దర్శకుడు షనీల్ డియో తెరకెక్కించిన ఈ చిత్రం, శేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్, కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథలను ఎంచుకోవడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకున్నారు.
ఈ సినిమా విజయంతో బాక్సాఫీస్ వద్ద ఆయనకున్న క్రేజ్ మరోసారి రుజువైంది. మాస్ ఎలిమెంట్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించే అంశాలు ఉండటంతో అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. నిర్మాత సుప్రియ యార్లగడ్డకు ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాభాల బాట పట్టింది. రిలీజ్‌కు ముందే పక్కా ప్లానింగ్ తో వెళ్లడం, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మంచి ఆదాయం రావడం సినిమాకు ప్లస్ అయ్యింది. ప్రస్తుతం థియేటర్లలో వస్తున్న నిలకడైన వసూళ్లు నిర్మాతలకు అదనపు లాభాలను తెచ్చిపెడుతున్నాయి.
తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ కంటెంట్‌ను అందిస్తూ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం శేష్ సినిమాలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. ఈ సక్సెస్ తో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉంది.
ఏదేమైనా ‘డెకాయిట్’ మొదటి వారం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా పూర్తి చేసుకునేలా కనిపిస్తోంది. వీక్ డేస్ టెస్ట్ పాస్ అవ్వడమే కాకుండా, రోజురోజుకూ బుకింగ్స్ పెరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. సమ్మర్ సెలవులు కూడా సినిమాకు అదనపు బూస్ట్ ఇస్తున్నాయి. రాబోయే వీకెండ్ లో కూడా ఇదే జోరు కొనసాగితే, అడివి శేష్ ఖాతాలో మరో భారీ కమర్షియల్ హిట్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.