స్విమ్ సూట్‌లో క‌వ్విస్తున్న ఈ బ్యూటీ ఎవ‌రు?

అహ‌నా కుమ్రా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 2022లో మధుర్ భండార్కర్ `ఇండియా లాక్‌డౌన్‌`లో చివరిసారిగా కనిపించింది.;

Update: 2025-03-30 06:09 GMT

అహ‌నా కుమ్రా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 2022లో మధుర్ భండార్కర్ `ఇండియా లాక్‌డౌన్‌`లో చివరిసారిగా కనిపించింది. కానీ ఇటీవ‌ల ఆశించిన పెద్ద ఆఫ‌ర్లు ఏవీ రాక‌పోవ‌డంతో నిరాశ‌లో కూరుకుపోయింది. గత మూడేళ్లుగా ఈ భామ‌కు ఎలాంటి పెద్ద అవ‌కాశాల్లేవ్. దీంతో చాలా నిరాశ‌లో కూరుకుపోయింది.

అయితే ఈ భామ‌కు సోష‌ల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఈ వేదిక‌పై వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌ను షేర్ చేస్తూ బాగానే ఆర్జిస్తోంది. అహానా కుమ్రా సూపర్ స్టైలిష్ సమ్మర్ లుక్ ని తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. అహ‌నా `సమ్మర్ స్టేట్ ఆఫ్ మైండ్`లో ఉంది అంటూ అభిమానులు అహ‌నాపై కామెంట్లు చేస్తున్నారు.

తాజా ఇన్‌స్టా పోస్ట్‌లో ఈ బ్యూటీ తన పూల్ డే నుండి కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఇది స‌మ్మ‌ర్ ఫ్యాషన్‌ను ఎలివేట్ చేస్తోంది. అహ‌నా చిక్ సమ్మర్ స్టైల్‌పై ఫ్యాన్స్ ఇప్పుడు విరుచుకుప‌డుతున్నారు. స్విమ్ సూట్ పై వేడెక్కించే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అహ‌నా స్ట్రాపీ స్విమ్‌సూట్ మైక్రో ప్రింట్‌లతో ప్ర‌త్యేకంగా కనిపించింది.

ఇండియా లాక్‌డౌన్ ట్రైలర్: ది హారర్స్ ఆఫ్ పాండమిక్ పేరుతో ట్రైల‌ర్ విడుద‌లయ్యాక అహ‌నా ప్ర‌తిభ గురించి లోకానికి తెలిసింది. 2020లో కోవిడ్-19 రెండు సార్లు లాక్ డౌన్ లకు కారణమైంది. క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో జీ5 చిత్రం హాట్ టాపిక్ అయింది. ఇందులో శ్వేతా బసు ప్రసాద్- ప్రతీక్ బబ్బర్- అహనా కుమ్రా- సాయి తమంకర్- ప్రకాష్ బెలవాడి త‌దిత‌రులు న‌టించారు. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2022 డిసెంబర్ 2న జీ5లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం అహ‌నా కుమ్రా సోష‌ల్ మీడియాల్లో వ‌ర‌స ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. త‌న ఇన్ స్టాలో ఎక్కువ‌గా బాద్ షా షారూఖ్ తో క‌ల‌సి ఉన్న ఫోటోల‌ను అహ‌నా షేర్ చేసింది. సౌత్ హీరో సూర్య‌తోను సెల్ఫీ దిగి దానిని పోస్ట్ చేసింది. మ‌రోవైపు అహ‌నా స్పెష‌ల్ ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో వేడెక్కిస్తున్నాయి.

Tags:    

Similar News