AA23 కోసం లోకేష్ ఏం ప్లాన్ చేస్తున్నాడు?

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మే 25, 26 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమైన‌ట్టు తెలుస్తోంది.

Update: 2026-06-09 11:00 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న AA23 ప్రాజెక్ట్‌పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అధికారికంగా షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా చుట్టూ వినిపిస్తున్న అప్డేట్లు చూస్తుంటే, మేకర్స్ ఎంత పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారో అర్థమవుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, AA23 కోసం బ్యాక్‌ఎండ్ వర్క్ ఇప్పటికే వేగంగా సాగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మే 25, 26 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమైన‌ట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జూన్ తొలి వారంలో మరోసారి ఇద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ వరుస సమావేశాలు కేవలం స్టోరీ డిస్క‌ష‌న్స్ కోసమే కాకుండా, సినిమా టోన్, పాత్ర రూపకల్పన, నిర్మాణ స్థాయి వంటి అంశాలపై కూడా జరిగి ఉండొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు లియో సినిమాకు కో రైట‌ర్ గా వ‌ర్క్ చేసిన రత్న కుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ డ్రాఫ్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. అంటే కథా నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంటోందని అర్థమవుతోంది.

ఇక ప్రీ- ప్రొడక్షన్ వ‌ర్క్స్ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. చిత్ర యూనిట్ లోని ఒక విభాగం ఇప్పటికే లొకేషన్ రెక్కీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ నగరం ఈ కథలో కీలకమైన భాగంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ గత సినిమాల‌ను పరిశీలిస్తే, కథకు బలమైన నేపథ్యం ఇచ్చే ప్రదేశాలను ఎంపిక చేయడంలో ఆయనకు ప్రత్యేక శైలి ఉంది. అందుకే ఢిల్లీ సెలెక్ష‌న్ వెనుక కూడా కథలో కీలక మలుపులు లేదా భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.

అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, రాకా ప్రాజెక్ట్ పూర్తైన వెంటనే అల్లు అర్జున్ తన పూర్తి దృష్టిని AA23పై కేంద్రీకరించనున్నట్లు సమాచారం. అంటే షూటింగ్ ప్రారంభానికి ముందే స్క్రిప్ట్, లొకేషన్స్, టెక్నికల్ ప్లానింగ్ వంటి అంశాలను పూర్తిగా రెడీ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎలాంటి హడావుడి లేకుండా, ప్రతి దశను జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

పుష్ప ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరించుకున్న అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ వంటి మాస్ యాక్షన్ కథలను కొత్త స్థాయికి తీసుకెళ్లగల డైరెక్ట‌ర్ తో జతకట్టడం వల్ల AA23పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పుడు బయటకు వస్తున్న ఈ ప్రీ ప్రొడక్షన్ అప్డేట్లు చూస్తుంటే, ఈ సినిమా కేవలం మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా కాకుండా, అత్యంత ప్రణాళికాబద్ధంగా రూపొందుతున్న మెగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News