కాంగ్రెస్ అభ్యర్థి తగ్గేదేలే... ఎనిమిదో రౌండ్ అప్ డేట్ ఇదే!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ నుంచీ ఆధిపత్యం కనబరిచిన ఆయన... ఎనిమిదో రౌండ్ లోనూ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఇందులో భాగంగా... ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి 23 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇలా తమ అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ వస్తోన్న నేపథ్యంలో... గాంధీ భవన్ వద్ద సంబరాలు మొదలైపోయాయి. మరోవైపు నవీన్ యాదవ్ ఇంటి వద్ద శ్రేణులు సందడి చేస్తున్నారు.
Update: 2025-11-14 07:17 GMT