ఎంఐఎం పరిస్థితి ఇదే!

బీహార్ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే కూటమి దూసుకుపోతున్నట్లు తాజా ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ పరిస్థితి 2020లో కంటే మరీ దారుణంగా మారడం గమనార్హం! ఇక ఎంఐఎం విషయానికొస్తే.. గత ఎన్నికలతో పోలిస్తే ఫలితాలు మరింత నీరసంగా ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆ పార్టీ అద్భుత ప్రదర్శన చేసి ఐదు స్థానాలను గెలుచుకుంది.

ఆ ఐదు స్థానాలూ అరారియా, కతిహార్, కిషన్‌ గంజ్, పూర్నియా అనే నాలుగు జిల్లాలతో కూడిన సీమాంచల్ ప్రాంతంలోవి కాగా... ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటంతో ఈసారీ ఆశలు పెద్దగానే పెట్టుకొంది! అయితే, ఈ దఫా ఆ పార్టీ ఈ ప్రాంతంలో కేవలం రెండు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది! ఆ రెండు స్థానాలు కతిహార్ జిల్లాలోని బలరాంపూర్, పూర్నియాలోని బైసి.

కాగా... 2020 ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఆర్జేడీలోకి ఫిరాయించగా.. అమౌర్ నుండి గెలిచిన అఖ్తరుల్ ఇమాన్ మాత్రమే పార్టీలోనే ఉన్నారు. అయితే తాజాగా ఇమాన్ ఇప్పుడు ఆ స్థానం నుండి ఓడిపోతున్నారని తెలుస్తోంది!

Update: 2025-11-14 06:15 GMT

Linked news