బీహార్ తర్వాత ఎన్డీయే లక్ష్యం ఈ రాష్ట్రమేనంట!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది! శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ తన ఆధిపత్యాన్ని కనబరుస్తూనే ఉంది. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తమ తదుపరి లక్ష్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... బీహార్ లో అరాచక ప్రభుత్వం ఏర్పాటు కాదని నిర్ణయించుకుందని.. బీహార్ యువత తెలివైనవారని.. ఇది అభివృద్ధి విజయమని.. ఇక తమ నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని అన్నారు. బీహార్.. గందరగోళం, అవినీతి, దోపిడీ ప్రభుత్వాన్ని అంగీకరించదనేది మొదటి రోజు నుండే స్పష్టంగా ఉందని సింగ్ అన్నారు.
Update: 2025-11-14 05:04 GMT