Begin typing your search above and press return to search.

టీడీపీలో 'రోజులు' మారాయ్‌.. !

స్థానిక, మండల పరిషత్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు సహకరించని టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టారు. పార్టీ చేయించిన సర్వేలోనూ వారి నిర్లక్ష్యం బయటపడిందని, అందరి వివరాలు తన వద్ద ఉన్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో 40 మంది రెబల్స్‌పై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.

By:  Garuda Media   |   12 Nov 2026 4:00 AM IST
టీడీపీలో రోజులు మారాయ్‌.. !
X

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స్ట‌యిల్ వేరు. పార్టీ ప‌రంగా నాయ‌కుల‌ను ఆయ‌న డీల్ చేసే విధానం డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఒక‌రిద్ద‌రు త‌ప్పులు చేసిన నాయ‌కుల‌ను కూడా ఆయ‌న హెచ్చ‌రించి వ‌దిలేయ‌డ‌మో.. లేదా.. సూచ‌న లు చేయ‌డ‌మో వ‌ర‌కే ప‌రిమితం అవుతారు. అందుకే.. పార్టీలో చంద్ర‌బాబు విధానాలు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశంగా నే ఉంటున్నాయి. అయితే.. ఈ విధానాలు కొంద‌రు నాయ‌కుల‌కు అందివ‌చ్చిన వ‌రాలుగా మారుతున్నాయ‌న్న వాద‌న ఉంది. వారు మార‌క‌పోగా.. చంద్ర‌బాబు కేవ‌లం హెచ్చరించి వ‌దిలేస్తారులే! అనుకునే టైపు నేత‌లు ఉన్నారు.

అయితే.. రోజుల‌న్నీ ఒకేలా ఉండ‌వు క‌దా!. ఇప్పుడు టీడీపీలోనూ రోజులు మారుతున్నాయి. నిన్న ఉన్న‌ట్టుగా రేపు ఉండ‌క‌పోవ‌చ్చు. ఇది స‌హ‌జంగానే నాయ‌క‌త్వ మార్పు సంధి వేళ జ‌రిగే ప్ర‌క్రియే. ఇప్పుడు కాక‌పోతే.. రేపైనా పార్టీ ప‌గ్గాల‌ను మంత్రి నారా లోకేష్ కు అప్ప‌గించ‌డం త‌ప్ప‌దు. అందుకే.. టీడీపీలో రోజులు మారుతున్నాయ‌న్న టాక్ వినిపిస్తోంది. ఏ నాయ‌కుడిని కదిపినా.. ఇదే వినిపిస్తోంది. ''చంద్ర‌బాబు సార్‌ మాదిరిగా ఉండ‌ద‌య్యా. మీకు మీరు తెలుసుకోవాలి.'' అంటూ.. నాయ‌కులు కింది స్తాయి నేత‌ల‌ను హెచ్చ‌రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఏంటి కార‌ణం..?

తాజాగా జ‌రిగిన స్థానిక‌, మండ‌ల‌పరిష‌త్ ఎన్నిక‌ల్లో కొన్ని ప్రాంతాల్లో టీడీపీనాయ‌కులు ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించా రు. మాకెందుకులే అని స‌రిపుచ్చుకున్నారు. ముఖ్యంగా కూట‌మి మిత్ర‌ప‌క్షాల‌కు కేటాయించిన స్థానాల్లో టీడీపీ స్థానిక కేడ‌ర్ స‌హ‌క‌రించ‌లేద‌న్న వార్త‌ల‌తో పాటు టీడీపీ చేయించిన స‌ర్వేలోనూ స్ప‌ష్ట‌మైంది. ఈ నేప‌థ్యంలో ఇలా వ్య‌వ‌హ‌రించిన నాయ‌కుల వ్య‌వ‌హారంపై.. మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పుకొచ్చారు. ``అంద‌రి చిట్టా నాద‌గ్గ‌ర ఉంది.. వారి సంగ‌తి చూస్తా`` అంటూ ఒకింత క‌ఠినంగానే వ్యాఖ్యానించారు.

ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌యన‌గ‌రం, అల్లూరి సీతారామ‌రాజు, అనంత‌పురం స‌హా.. చిత్తూరులోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నూ వైసీపీ స్థానిక‌, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో పుంజుకుంది. ఇక్క‌డ టీడీపీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ వైసీపీ ఎలా పుంజుకుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఈ విష‌యం వెనుక త‌మ్ముళ్ల ఉదాశీన‌త‌... కూట‌మిలో స‌ఖ్య‌త లోపించ‌డం.. అధిష్టానం సూచ‌న‌ల‌ను కూడా పాటించ‌క పోవ‌డం వంటివి ఉన్నాయ‌ని గుర్తించారు.

ఈ క్ర‌మంలోనే నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. అదే చంద్ర‌బాబు అయితే.. ప‌రిశీలిస్తాం.. త‌ప్పులు స‌రిచేస్తాం.. అనే వారు. కానీ, లోకేష్ మాత్రం క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తొలి వ్యాఖ్య‌లోనే చెప్పేశారు. ఇదే ఇప్పుడు టీడీపీలో రోజులు మారాయ్ అనే కామెంట్లు రావ‌డానికి కార‌ణ‌మైంది. మ‌రి ఏం చేస్తార‌న్న‌ది చూడాలి. కాగా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో 40 మంది నాయ‌కులు రెబ‌ల్‌గా రంగంలోకి దిగగా.. వారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసిన విష‌యం తెలిసిందే.