Begin typing your search above and press return to search.

VD 14.. ఆ బ్రదర్స్ రిజెక్ట్ చేసిన మూవీనా?

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినీ ఇండస్ట్రీతో పాటు యూత్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 May 2024 6:35 AM GMT
VD 14.. ఆ బ్రదర్స్ రిజెక్ట్ చేసిన మూవీనా?
X

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సినీ ఇండస్ట్రీతో పాటు యూత్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూపర్ హిట్ మూవీ గీత గోవిందం కాంబో కావడంతో ఫ్యాన్స్, సినీ ప్రియులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ వాటిని ఫ్యామిలీ స్టార్ అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీలపై దృష్టి పెట్టారు విజయ్.

కచ్చితంగా భారీ హిట్ కొట్టాలని ఆచితూచి కథలు ఎంచుకుంటున్నారు విజయ్. ప్రస్తుతం జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతున్నట్లు మేకర్స్ ఇటీవల అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కెరీర్ లో తొలిసారి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ.. పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.

ఇక బర్త్ డే రోజు మరో రెండు కొత్త సినిమాలను విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీంతోపాటు తనకు టాక్సీవాలా మూవీతో మంచి హిట్ అందించిన రాహుల్ సాంకృత్యాన్ తో మరోసారి చేతులు కలిపారు విజయ్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా నిర్మించనుంది.

పీరియాడికల్‌ యాక్షన్‌ జోనర్ లో రూపొందనున్న ఈ సినిమా గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ మూవీ స్టోరీని ఇప్పటికే తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీలకు వినిపించారట. ఇద్దరు అన్నదమ్ములను తండ్రీకొడుకులుగా చూపిస్తూ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా ప్లాన్ చేశారట రాహుల్. సూర్య, కార్తీలకు కూడా కథ నచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల ఓకే చేయలేకపోయారని తెలుస్తోంది.

దీంతో విజయ్ కు కథ వినిపించి రాహుల్ సాంకృత్యాన్ ఓకే చేయించుకున్నారని తెలుస్తోంది. విజయ్ ఇమేజ్ కు తగ్గట్టు స్టోరీలో కొన్ని మార్పులు చేశారట. విజయ్ దేవరకొండ రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో కనిపించబోతున్నట్టు కూడా టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ఈ సినిమాలో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.