Begin typing your search above and press return to search.

టాలీవుడ్ టార్గెట్ 4500 కోట్లా?

అందులోనూ న‌లుగురు హీరోలు ప్ర‌ముఖంగా బాక్సాఫీస్ టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   30 April 2024 6:03 AM GMT
టాలీవుడ్ టార్గెట్ 4500 కోట్లా?
X

2024 టాలీవుడ్ బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్సైందా? బాలీవుడ్ క‌న్నా టాలీవుడ్ బాక్సాఫీస్ ముందంజ‌లో ఉందా? అంటే అవుననే తెలుస్తోంది. గ‌తేడాది ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద బాలీవుడ్ దే అప్ప‌ర్ హ్యాండ్ అయింది. కానీ ఈసారి ఆ ఛాన్స్ టాలీవుడ్ తీసుకోబోతుంది. ఇక్క‌డ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలురిలీజ్ అవుతున్నాయి. అందులోనూ న‌లుగురు హీరోలు ప్ర‌ముఖంగా బాక్సాఫీస్ టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌భాస్ న‌టిస్తోన్న 'క‌ల్కి 2898' ఎట్ట‌కేల‌కు జూన్ 27 న రిలీజ్ ఫిక్సయింది. నాగ్అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 1500 కోట్ల‌కు పైగ వ‌సూళ్లు సాధించే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ అంచ‌నా వేస్తుంది. ప్ర‌భాస్ గ‌త పాన్ ఇండియా రిలీజ్ లు బేస్ చేసుకుని ఈ అంచ‌నా వేస్తున్నారు. 'బాహుబ‌లి' ప్రాంచైజీ నుంచి 2500 కోట్ల‌కు పైగా రాబ‌ట్టిన న‌టుడ‌త‌ను. అటుపై ప్లాప్ టాక్ తెచ్చుకున్న‌' సాహో'.. 'రాధేశ్యామ్'..'ఆదిపురుష్' లాంటి చిత్రాలు మూడు క‌లిపి 600 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబట్టాయి. పెట్టిన పెట్టుబ‌డ‌కి ఆ మూడు చిత్రాలు న‌ష్టాల్ని కూడా పూడ్చ‌లే క‌పోయాయి.

అటుపై రిలీజ్ అయిన స‌లార్ సీజ్ ఫైర్ మాత్రం 700 కోట్ల‌కు పైగా వ‌సూళ్లును సాధించింది. దీంతో ప్ర‌భాస్ మార్కెట్ మ‌ళ్లీ స్పీడ‌ప్ అయింది. ఆలెక్క‌లు ప్ల‌స్ నాగ్ అశ్విన్ గ‌త ట్రాక్ తో 'క‌ల్కి 2898' 1500 కోట్ల వ‌ర‌కూ రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని వినిపిస్తుంది. ఇక ఆగ‌స్టులో భారీ అంచాన‌ల మ‌ధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తోన్న 'పుష్ప‌-2' రిలీజ్ అవుతుంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే పాన్ ఇండియాలో 'పుష్ప' భారీ వ‌సూళ్లు సాధించిన నేప‌థ్యంలో రెండ‌వ భాగం 1000 కోట్లు వ‌సూళ్లు టార్గెట్ గా బ‌రిలోకి దిగుతుంది. అంత‌కు మించే వ‌సూళ్లు చేస్తుంద‌ని మేక‌ర్స్ అంచ‌నా వేస్తున్నారు.

అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ -శంక‌ర్ కాంబినేష‌న్ లో రిలీజ్ అవుతోన్న 'గేమ్ ఛేంజ‌ర్' పైనా అలాంటి అంచ‌నాలే ఉన్నాయి. పాన్ ఇండియాలో చ‌ర‌ణ్ మార్కెట్ ఈ సినిమాకి అత్యంత కీల‌కంగా మారింది. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంటే సౌత్ నుంచే భారీ వ‌సూళ్లు సాధిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. నార్త్ రీజియ‌న్లో చ‌ర‌ణ్ మార్కెట్ అసాధార‌ణంగా ఉంది. అవ‌న్నీబేస్ చేసుకుంటే ఈసినిమా 1000 కోట్లు సాధిస్తుంద‌నే మేక‌ర్స్ అంచ‌నా వేస్తున్నారు. ఈసినిమా అక్టోబ‌ర్ లేదా డిసెంబ‌ర్ లో రిలీజ్ కానుంది.

ఇక యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న 'దేవ‌ర' గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అభిమానులు కాల‌రెగ‌రేసుకునేలా సినిమా ఉంటుంద‌ని తార‌క్ జ‌నాల్లోకి ఎక్కించేసాడు. అత‌డి కామెంట్ తో అంచ‌నాలుభారీగా ఏర్ప‌డుతున్నాయి. కేవ‌లం ఫ‌స్ట్ లుక్..మోష‌న్ పోస్ట‌ర్ తోనే బోలెడంత బ‌జ్ క్రియేట్ అయింది. వార్ -2 తో తార‌క్ బాలీవుడ్ లో లాంచ్ అవ్వ‌డం ఈసినిమా బ‌జ్ కి మ‌రింత కీల‌కంగా మారింది. నార్త్ రీజియ‌న్ లో తార‌క్ ఫ్యాన్ బేస్ అంతకంత‌కు పెరుగుతోంది. అలా 2024 లో ఈ నాలుగు సినిమాలు భారీ అంచ‌నాల‌తో టార్గెట్ ఫిక్స్ చేసుకుని బాక్సాఫీస్ బ‌రిలోకి దిగుతున్నాయి.