Begin typing your search above and press return to search.

తారక్‌ అంతకు మించి.. జక్కన్న సూపర్‌ కామెంట్స్‌

రాజమౌళి తాజాగా ఒక సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

By:  Tupaki Desk   |   2 May 2024 5:46 AM GMT
తారక్‌ అంతకు మించి.. జక్కన్న సూపర్‌ కామెంట్స్‌
X

ఎన్టీఆర్‌ ను యంగ్‌ టైగర్‌ గా చేసింది రాజమౌళి అయితే... రాజమౌళి స్టార్‌ దర్శకుడిగా మారడంలో ఎన్టీఆర్‌ కీలక పాత్ర పోషించాడు అనడంలో సందేహం లేదు. ఇద్దరు కూడా కాస్త అటు ఇటుగా ఒకేసారి కెరీర్ ను ఆరంభించారు. ఇద్దరూ కలిసి చేసిన ప్రాజెక్ట్‌ లు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. అందుకే ఇద్దరూ మంచి మిత్రులు అని అంతా అనుకుంటారు.

రాజమౌళి తాజాగా ఒక సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళిని యాంకర్ ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్‌ ఎవరు అంటూ ప్రశ్నించగా వెనుక నుంచి చాలా మంది తారక్‌ అంటూ మొత్తుకున్నారు. అప్పుడు రాజమౌళి స్పందిస్తూ ఎన్టీఆర్‌ నాకు మిత్రుడు కంటే తమ్ముడులాగా అన్నాడు.

గతంలో ఎన్టీఆర్‌ కూడా రాజమౌళిని తన అన్న స్థానంలో ఉంచుతాను అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరూ కూడా ఇలా స్నేహితులం కాదు అంతకు మించి అంటూ మాట్లాడటం ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతను చెప్పకనే చెబుతుంది. రాజమౌళి తాజా వ్యాఖ్యల వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు తారక్‌ గురించి రాజమౌళి కామెంట్స్ ను సూపర్‌ అంటూ కితాబిస్తున్నారు. నిజంగా ఇద్దరి మధ్య బాండ్డింగ్‌ నెవ్వర్ బిఫోర్‌ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్‌ అవ్వడంతో మళ్లీ వీరి కాంబో సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఎన్టీఆర్‌ ను తన తమ్ముడితో సమానం అంటూ చెప్పిన రాజమౌళి ఇండస్ట్రీలో తనకు సాయి కొర్రపాటి మరియు శోభు యార్లగడ్డ లు క్లోజ్ ఫ్రెండ్స్ అన్నాడు.

ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ ను సిద్ధం చేసుకున్న రాజమౌళి త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ముగించి షూటింగ్‌ ను ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాడు. సినిమాలోని మెజార్టీ సన్నివేశాలను ఆఫ్రికాలో చిత్రీకరించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.