Begin typing your search above and press return to search.

కోల్ కతా వర్సెస్ రాజస్థాన్... హెడ్ టు హెడ్ గణాంకాలు!

కోల్‌ కతా, రాజస్థాన్‌ లు ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వీటిలో కోల్ కతా నైట్ రైడర్స్ 14 మ్యాచ్‌ లు గెలుపొందగా, రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లలో గెలిచింది.

By:  Tupaki Desk   |   16 April 2024 4:08 AM GMT
కోల్  కతా వర్సెస్  రాజస్థాన్... హెడ్  టు హెడ్  గణాంకాలు!
X

ఐపీఎల్ సీజన్ 2024లో భాగంగా.. మరో ఆసక్తికరమైన మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్ సిద్ధమైంది. ఈ క్రమంలో కోల్‌ కతా నైట్ రైడర్స్ – రాజస్థాన్ రాయల్స్ నేడు తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఐదు మ్యాచ్‌ లు ఆడిన కోల్ కతా నైట్ రైడర్... నాలుగు మ్యాచ్ లలో గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉండగా.. ఆడిన ఆరు మ్యాచ్ లలో 5 గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో ఉంది రాజస్థాన్. దీంతో... ఈ మ్యాచ్ అనంతరం పాయింట్ల పట్టికలో ప్లేస్ లు మారతాయా లేదా అనేది ఆసక్తిగా మారింది.

ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఒక అద్భుతమైన జట్టుగా ఉందనే చెప్పాలి. జట్టులోని ప్రతి ఆటగాడు జట్టు ఊపును కొనసాగించడానికి సహకరిస్తున్నాడు. సునీల్ నరైన్‌ ను ఫిల్ సాల్ట్‌ తో కలిపి ఓపెనింగ్ కి పంపడం ఒక విజయవంతమైన వ్యూహాత్మక నిర్ణయంగా చెబుతున్నారు. ఇటీవల లక్నోతో జరిగిన మ్యాచ్‌ లో, ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, ఫిల్ సాల్ట్ బౌలర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించాడు. 47 బంతుల్లో 89 పరుగులతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదే సమయంలో టోర్నమెంట్‌ లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తో పాటు దీపక్ హుడా, ఎన్ పూరన్, అర్షద్ ఖాన్‌ లు కీలక వికెట్లు తీయడం.. వీరికి సునీల్ నరైన్ - వరుణ్ చక్రవర్తిల స్పిన్ ద్వయం బలీయంగా, పొదుపుగా బౌలింగ్ చేయడం సహకరిస్తుంది. కీలక సమయాల్లో బౌలర్ల పై వీరు నెలకొల్పుతున్న ఒత్తిడి మ్యాచ్ లో కీ రోల్ పోషిస్తుందనే చెప్పాలి.

జైపూర్‌ లో గుజరాత్ టైటాన్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో ఓటమి పాలైనప్పటికీ రాజస్థాన్ రాయల్స్ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అన్ని విభాగాల్లో రాణిస్తూ పంజాబ్ తో జరిగిన ఆఖరి మ్యాచ్ లో పుంజుకున్నారు. ముందుగా బౌలింగ్ ఎంచుకున్న జట్టు పంజాబ్ ని కేవలం 147 పరుగులకే పరిమితం చేయడంలో విజయం సాధించింది. రాయల్స్ లో ప్రతి బౌలర్ కనీసం ఒక వికెట్‌ తో సహా, తొమ్మిది కంటే తక్కువ ఎకానమీ రేటును కొనసాగించారు!

హెడ్ టు హెడ్ రికార్డులు!:

కోల్‌ కతా, రాజస్థాన్‌ లు ఇప్పటి వరకు 28 ఐపీఎల్ మ్యాచ్‌ లు ఆడాయి. వీటిలో కోల్ కతా నైట్ రైడర్స్ 14 మ్యాచ్‌ లు గెలుపొందగా, రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్ లలో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితాలను ఇవ్వలేదు. ఇక రాజస్థాన్ పై కోల్‌ కతా అత్యధిక స్కోరు 210 కాగా.. కోల్ కతాపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 217.

పిచ్ రిపోర్ట్:

బ్యాటర్ల స్వర్గధామంగా చెప్పే ఈడెన్ గార్డెన్స్ లో ఈసారి రికార్డ్ స్థాయి స్కోరు నమోదవుతుందని అంటున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు పేసర్లు 519 వికెట్లు తీయగా, స్పిన్నర్లు 390 వికెట్లు తీశారు.