Begin typing your search above and press return to search.

పట్టువదలని రాజస్థాన్... పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ పదిలం!

దీంతో పాయింట్ల పట్టికలో తన టాప్ ప్లేస్ ని నిలుపుకున్న రాజస్థాన్... ఐదో విక్టరీని నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   14 April 2024 4:24 AM GMT
పట్టువదలని రాజస్థాన్... పాయింట్ల పట్టికలో ఫస్ట్  ప్లేస్  పదిలం!
X

ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా... పంజాబ్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్ మద్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ శిఖర్ ధావన్‌ కు బదులుగా సామ్‌ కరన్‌ నాయకత్వం వహించాడు. ఈ క్రమంలో... రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆద్యాంతం ఎలా జరిగిందనేది ఇప్పుడు చూద్దాం!

బ్యాటింగ్ కు దిగిన పంజాబ్!:

టాస్‌ ఓడిన పంజాబ్‌ బ్యాటింగ్‌ కు దిగింది. ఇందులో భాగంగా... అథర్వ తైడే, జానీ బెయిర్‌ స్టో క్రీజులోకి వచ్చారు. ఈ సమయంలో... ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్‌ లో నాలుగు పరుగులే వచ్చాయి. అనంతరం కుల్దీప్‌ సేన్ వేసిన రెండో ఓవర్‌ లో 13 పరుగులు రాగా... ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ లో 9 పరుగులు వచ్చాయి. దీంతో మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్లేమీ నష్టపోకుండా పంజాబ్ 26 పరుగులు చేసింది.

పంజాబ్ ఫస్ట్ వికెట్ డౌన్!:

అవేశ్‌ ఖాన్‌ వేసిన 3.4 ఓవర్‌ లో అథర్వ తైడే (15: 12 బంతుల్లో) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ స్కోరు 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 28 పరుగులకు చేరింది.

వరుసగా వికెట్లు కోల్పోయిన పంజాబ్‌!:

యుజ్వేంద్ర చాహల్ వేసిన ఏడో ఓవర్‌ లో మూడో బంతికి ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్ (10) ఔటవ్వగా... కేశవ్‌ మహరాజ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ లో చివరి బంతికి జానీ బెయిర్‌ స్టో (15) ఔటయ్యాడు. దీంతో పంజాబ్ కష్టాల్లో పడినట్లయ్యింది. దీంతో 7 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 47కు చెరింది.

సగం ఓవర్లు పూర్తి.. పంజాబ్ నాలుగు వికెట్లు డౌన్!:

రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... కేశవ్ మహరాజ్‌ వేసిన 10 ఓవర్‌ లో మూడో బంతికి సామ్‌ కరన్‌ (6) ఔటయ్యాడు. దీంతో 10 ఓవర్లకు స్కోరు 4 వికెట్ల నష్టానికి 53గా ఉంది.

పంజాబ్‌ ఐదు వికెట్లు డౌన్!:

కుల్దీప్‌ సేన్‌ వేసిన 12.1 ఓవర్‌ కు శశాంక్‌ సింగ్ (9) ఔటయ్యాడు. ఈ ఓవర్‌ లో కుల్దీప్‌ సేన్ ఒక వికెట్ పడగొట్టి రెండు పరుగులే ఇవ్వడంతో 13 ఓవర్లకు పంజాబ్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.

దూకుడు పెంచిన పంజాబ్ బ్యాటర్లు!:

యుజ్వేంద్ర చాహల్ వేసిన 15 ఓవర్‌ ఐదో బంతికి జితేశ్‌ శర్మ ఈ ఇన్నింగ్స్ లో ఫస్ట్ సిక్సర్ బాదాడు. ఫలితంగా ఈ ఓవర్ లో 11 పరుగులు వచ్చాయి. అనంతరం కుల్దీప్ సేన్ వేసిన 16 ఓవర్‌ లో లివింగ్‌ స్టోన్.. ఓ ఫోర్, సిక్స్ బాదగా.. జితేశ్ కూడా సిక్స్ కొట్టాడు. దీంతో... ఈ ఓవర్ లో 17 పరుగులు వచ్చాయి. ఫలితంగా... 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది.

ఆరు, ఏడు వికెట్ల పతనం ఇలా!:

అవేశ్‌ ఖాన్‌ వేసిన 16.1 ఓవర్‌ లో జితేశ్‌ శర్మ (29) ఔటవ్వగా... చాహల్ వేసిన 17.5 ఓవర్‌ లో లివింగ్‌ స్టోన్ (21) రనౌటయ్యాడు. దీంతో 18 ఓవర్లకు పంజాబ్ 7 వికెట్లు కోల్పోయిన 123 పరుగులు చేసింది.

ముగిసిన పంజాబ్‌ బ్యాటింగ్.. రాజస్థాన్‌ లక్ష్యం 148!:

రాజస్థాన్‌ తో జరుగుతున్న మ్యాచ్‌ లో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్స్ లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన అశుతోష్ శర్మ (31: 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌ లు) టాప్‌ స్కోరర్‌ కాగా.. జితేశ్ శర్మ (29), లివింగ్‌ స్టోన్ (21) పరుగులు చేశారు.

రాజస్థాన్ బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 2, కేశవ్ మహరాజ్‌ 2, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్‌ సేన్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్!:

పంజాబ్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు రాజస్థాన్ బరిలోకి దిగింది. తనుష్ కొటియన్, యశస్వి జైస్వాల్ క్రీజ్ లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో అర్ష్‌ దీప్‌ సింగ్ వేసిన తొలి ఓవర్‌ లో 9 పరుగులు వచ్చాయి. అనంతరం రబాడా వేసిన రెండో ఓవర్ ఔదు పరుగులు రాగా.. సామ్‌ కరన్‌ వేసిన మూడో ఓవర్లో కేవలం 2 పరుగులే వచ్చాయి.

ఇక, అర్ష్‌ దీప్‌ వేసిన నాలుగో ఓవర్ లో 13 పరుగులు రాగా.. సామ్‌ కరన్‌ వేసిన ఐదో ఓవర్ లో 7 పరుగులు వచ్చాయి. రబాడా వేసిన ఆరో ఓవర్లోనూ 7 పరుగులే వచ్చాయి. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ వికెట్లేమీ నష్టపోకుండా 43 పరుగులు సాధించింది.

రాజస్థాన్ తొలి వికెట్ డౌన్!:

లివింగ్‌ స్టోన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ లో రెండో బంతికి తనుష్ కొటియన్ (24) క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో 9 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి రాజస్థాన్ స్కోరు 58కి చేరింది. ఈ సమయంలో... యశస్వి జైస్వాల్ (30), సంజు శాంసన్ (1) క్రీజులో ఉన్నారు.

సగం ఓవర్లు పూర్తయ్యే సరికి పరిస్థితి ఇది!:

148 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్‌ నిలకడగా ఆడుతోంది. ఈ నేపథ్యంలో 10 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టపోయి 66 పరుగులు చేసింది.

రాజస్థాన్‌ రెండు, మూడు వికెట్స్ కోల్పోయింది ఇలా!:

రాజస్థాన్‌ రెండో వికెట్ కోల్పోయింది. రబాడ వేసిన 11.4 ఓవర్‌ లో యశస్వి జైస్వాల్ (39; 28 బంతుల్లో) ఔటయ్యాడు. అనంతరం రబాడ వేసిన 13.2 ఓవర్‌ సంజు శాంసన్ (18) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. దీంతో 14 ఓవర్లకు స్కోరు రాజస్థాన్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 90 పరుగులకు చేరింది.

రాజస్థాన్‌ ఐదు వికెట్లు డౌన్!:

అర్ష్‌ దీప్‌ వేసిన 17 ఓవర్‌ లో రెండో బంతికి సిక్స్ బాదిన పరాగ్... నాలుగో బంతికి భారీ షాట్ ఆడి దొరికిపోయాడు. అనంతరం హర్షల్ పటేల్ వేసిన 18 ఓవర్ లో ధ్రువ్ జురెల్ (6) ఔటయ్యాడు. ఈ సమయంలో జురెల్ ఔటైన తర్వాత వచ్చిన క్రీజ్ లోకి వచ్చిన హెట్‌ మయర్‌... అదే ఓవర్ లో చివరి రెండు బంతులకు వరుసగా ఫోర్, సిక్స్‌ బాదాడు. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 128కి చేరింది.

ఒకే ఓవర్లో రెండు వికెట్లు!:

సామ్‌ కరన్ వేసిన 19 ఓవర్‌ లో వరుసగా రెండు ఫోర్లు బాదిన రోవ్‌ మన్‌ పావెల్ (11: 5 బంతుల్లో) మూడో బంతికి ఔటయ్యాడు. అనంతరం... ఇదే ఓవర్ లో చివరి బంతికి కేశవ్‌ మహరాజ్‌ (1) పెవిలియన్ కు చేరాడు. దీంతో... చివరి ఓవర్‌ లో రాజస్థాన్‌ విజయానికి 10 పరుగులు అవసరం ఏర్పడింది.

రాజస్థాన్‌ విజయం!:

పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో రాజస్థాన్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. చివర్లో కాస్త ఉత్కంఠ ఏర్పడిన హెట్‌ మయర్ (27*: 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌ లు) మెరుపులు మెరిపించి జట్టును గెలిపించాడు.

పంజాబ్‌ బౌలర్లలో కగిసో రబాడ 2, సామ్‌ కరన్ 2, లివింగ్‌ స్టోన్, అర్ష్‌ దీప్‌ సింగ్, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

దీంతో పాయింట్ల పట్టికలో తన టాప్ ప్లేస్ ని నిలుపుకున్న రాజస్థాన్... ఐదో విక్టరీని నమోదు చేసింది.