Begin typing your search above and press return to search.

ఆ 26 లక్షల ఓట్లు ఎవరికి పడబోతున్నాయి.?

By:  Tupaki Desk   |   26 March 2019 8:26 AM GMT
ఆ 26 లక్షల ఓట్లు ఎవరికి పడబోతున్నాయి.?
X
గత ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి టిడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు వేసి లెక్కల్లో అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ కంటే.. ఏర్పాటు చేయని వైసీపీకి వచ్చిన ఓట్లు కేవలం 5 లక్షలే తక్కువ. అంటే 5 లక్షల ఓట్లు వచ్చి ఉంటే.. వైసీపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది. దీంతో.. ఇప్పుడు రెండు పార్టీలు ఈసారి ఓటింగ్‌ పర్సంటేజ్‌ పైనే ఫుల్ ఫోకస్‌ గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల కమిషన్‌ ఓటర్ల తుది జాబితా విడుదలచేసింది. 2014 లో ఏపి ఓట‌ర్ల జాబితా ప్ర‌కారం 3.67 కోట్లు ఉండ‌గా..ఇప్పుడు అది 3.93 కోట్ల‌కు చేరింది. 2014 ఎన్నిక‌ల్లో అధికార కూట‌మి- ప్ర‌తిప‌క్షం మ‌ధ్య ఓట్ల లేదా కేవ‌లం 1.95 శాతం దాదాపు అయిదు ల‌క్ష‌ల ఓట్లు. ఇక‌, ఇప్పుడు గ‌త కంటే 26 ల‌క్ష‌ల ఓట్లు పెరిగాయి. ఇవి ఏ పార్టీకి పడితే ఆ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అన్నమాట.

ఏపీలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 3,93,45,717 మంది. గతంతో పోలిస్తే 24,12,626 మంది ఓటర్లు పెరిగారు. అన్నింటికి మించి ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటే.. ఈ 24 లక్షల మంది ఓటర్లు కొత్తగా ఈ రెండున్నర నెలల్లో వచ్చినవాళ్లే. అంటే ఇన్నాళ్లు తటస్థంగా ఉన్నవాళ్లు కావొచ్చు, 18 ఏళ్లు నిండినవాళ్లు కావొచ్చు. ఇక ఏపీలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే 4,17,082 మంది అధికంగా ఉన్నారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి. ఇక్కడ ఓటర్ల సంఖ్య 42 లక్షలు దాటింది. విజయనగరం జిల్లా లాస్ట్‌ ప్లేస్‌ లోఉంది.

ఇక విశాఖపట్నం గాజువాక నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లా పెడన కాగా, ఇంకోటి విశాఖ జిల్లా భీమిలి. మొత్తానికి ఈ సారి అదనంగా వచ్చిన 24 లకల ఓట్లే ముఖ్యమంత్రిని డిసైడ్ చేయబోతున్నాయి.