Begin typing your search above and press return to search.

ఉద్యోగులు.... బాబుని సాగనంపే సద్యోగులు...

By:  Tupaki Desk   |   12 Dec 2018 4:16 PM GMT
ఉద్యోగులు.... బాబుని సాగనంపే సద్యోగులు...
X
ఉద్యోగులు. అందునా ప్రభుత్వ ఉద్యోగులు. అమ్మో వీరి ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలిసినంతగా వేరే ఏ పార్టీకీ, ఏ నాయకుడికి తెలియదు. ఇది సమైక్య రాష్ట్రంలో ఎంతటి ప్రభావం చూపిందో చంద్రబాబు నాయుడికి తెలిసిందే. ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ పాత సీన్ రిపీట్ అయ్యేలా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సమైక్య రాష్ట్రంలో ఉద్యోగులు ఇచ్చిన షాక్ చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో మరచి పోలేదు. అందుకే ఆ మధ్య తనను ఉద్యోగులు ఎలా దెబ్బ కొట్టిందీ చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పుకున్నారు. త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమ కసిని తీర్చుకోవాలను కుంటున్నారంటున్నారు.

ఏపీలో టీఏ, డిఏ బకాయిలు చెల్లింపులో ఆలస్యం చేయడం, పిఆర్సీ అమలులో తీవ్ర జాప్యం వంటి కీలక అంశాలు చంద్రబాబు నాయుడి పాలనపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, వారి వేతనాలు పెంచకపోవడం వంటి అంశాలు కూడా చంద్రబాబు నాయుడి ఓటమికి ఇతోథికంగా సహకరిస్తాయని అంటున్నారు. వీరికి తోడుగా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు కూడా చంద్రబాబునాయుడిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బాబు వస్తే జాజు గ్యారంటీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలతో నిరుద్యోగులను వంచించారనే ఆగ్రహం నిరుద్యోతగులకు నానాటికీ పెరుగుతోంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడి ఓటమి ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోనే ఉందని, వారే చంద్రబాబు నాయుడ్ని ఇంటకి పంపుతారని అంటున్నారు.

ఇంతకు ముందు సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఆదుకున్నారు. ఇప్పుడు ఆ పాత్రను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పోషించనున్నారని ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు గంపెడాశతో ఉన్నారు.ఇది తీరుతుందనే నమ్మకంతోనూ ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్ తో పోలిస్తే రాజకీయ అనుభవం ఎక్కువగా ఉన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశించారు. అయితే అందుకు విరుద్ధంగా గడచిన నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రజావ్యతిరేక నిర్ణయాల కారణంగానే ఆయన ఇంటికి వెళ్లడం ఖాయమని అంటున్నారు.