Begin typing your search above and press return to search.

బాబు సామగ్రిని బయటపడేశారు..

By:  Tupaki Desk   |   22 Jun 2019 9:36 AM GMT
బాబు సామగ్రిని బయటపడేశారు..
X
ప్రతిపక్ష నేత చంద్రబాబును ఏ కోశాన వదిలిపెట్టే ప్రసక్తే లేదని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.. ఆయన అక్రమంగా నిర్మించుకొని ఉంటున్న నివాసంపై ఇప్పటికే నజర్ పెట్టింది. ఒక ఆయన నివాసం పక్కనున్న ప్రజావేదికను కావాలన్న చంద్రబాబు ప్రతిపాదనను జగన్ ప్రభుత్వం పక్కనపెట్టి షాక్ ఇచ్చింది.

అసలే రాజధాని లేని ఏపీకి ఇప్పుడు ఉన్న కొద్ది వేదికలను బాబు వాడుకోవడంపై వైసీపీ సీరియస్ అయ్యింది. తాజాగా చంద్రబాబు నివాసం పక్కనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వాడుకున్న ప్రజావేదికను జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. చంద్రబాబు వ్యక్తిగత సామాన్లను ప్రభుత్వం సిబ్బంది బయటపడేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు సామన్లు బయటపడేయడంపై టీడీపీ నేతలు మండిపడి ఆందోళన చేశారు.

కాగా వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి కలెక్టర్ల సదస్సు జగన్ నిర్వహించాలని తలపోశారు. అయితే వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్ లో సమావేశం నిర్వహించాలని యోచించారు. అయితే అక్కడ ఇరుకుగా ఉండడం వసతులు లేకపోవడంతో చంద్రబాబు ఇది వరకు వినియోగించిన ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఈ ప్రజావేదిక తనకే కావాలని బాబు ఇదివరకు సీఎం జగన్ కు లేఖ రాశారు. అయితే దీనిపై జగన్ ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు బాబు ఆధీనంలో ఉన్న ప్రజావేధికను ఖాళీ చేయించి కలెక్టర్ల సదస్సు ఇక్కడే నిర్వహించాలని జగన్ గుంటూరు కలెక్టర్ ను ఆదేశించాడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు కలెక్టర్, జేసీ ఈ ప్రజావేదిక భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు సామగ్రిని బయటపడేశారు.

ఇక చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అవమానించేలా ప్రజావేదికను స్వాధీనం చేసుకొని బాబు వస్తువులు బయటపడేశారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఇక టీడీపీ నేతలు దీనిపై ప్రజావేదిక వద్ద ఆందోళన చేశారు.