Begin typing your search above and press return to search.

ప్చ్.. సూర్య మళ్ళీ మిస్సయిపోయాడా??

By:  Tupaki Desk   |   23 Jan 2017 1:24 PM GMT
ప్చ్.. సూర్య మళ్ళీ మిస్సయిపోయాడా??
X
మొన్నటివరకు జనవరి 26న రిలీజ్ కన్ఫామ్ అంటూ నానా హడావుడి చేసేశారు. నిన్న పేపర్లో యాడ్లు కూడా ఇచ్చేశారు. కాని ఇప్పుడు తమిళనాడులో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా.. విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నాడు స్టార్ హీరో సూర్య. అందుకే ఆయన పోలీస్ దుస్తులను వేసుకుని జనాలను అలరించడానికి ఇంకా టైమ్ పట్టేశాలా ఉంది.

నిజానికి ''యుముడు 3'' సినిమాను జనవరి 26న కన్ఫామ్ గా తెస్తున్నట్లు అటు సూర్యతో పాటు ఇటు తెలుగు ప్రొడ్యూసర్ మల్కాపురం శివకుమార్ కూడా చెప్పేశారు. కాకపోతే ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు నిరసనలు కొత్త టర్న్ తిరిగిపోవడంతో సీన్ మొత్తం మారిపోయింది. అక్కడ మెరీనా బీచ్ ను ప్రశాంతంగా విద్యార్ధులు ఖాళీ చేసి వెళిపోతారని అనుకుంటే.. పోలీసులతో గొడవల నుండి వాహనాలకు నిప్పెట్టడం వరకు వచ్చింది పరిస్థితి. దానితో సూర్య తమిళనాట తన పంపిణీదారులతో మాట్లాడి.. సినిమా రిలీజ్ ను పోస్టుపోన్ చేసుకుంటున్నట్లు చెప్పాడని తెలుస్తోంది.

ఇప్పటికే మూడు సార్లు సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో కాక మీదున్న తెలుగు నిర్మాత.. ఇప్పుడు జనవరి 26న సినిమా వస్తోంది అనగానే ఎక్సయిట్ అయ్యారు. కాని మళ్ళీ పోస్టుపోన్ అంటే మరి ఏమంటారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/