Begin typing your search above and press return to search.

ఈ పోస్టరేదో భలే ఉందండీ!!

By:  Tupaki Desk   |   26 July 2017 7:57 AM GMT
ఈ పోస్టరేదో భలే ఉందండీ!!
X
తమిళ్ సినిమా ఇప్పుడు కొత్త కథలుకు వైవిధ్య సినిమాలకు నిలయంగా మారుతుంది. అందుకే అక్కడ హీరోలు కూడ మన తెలుగు సినీ అభిమానుల అభిమానాన్ని పొందగలిగారు. ముందు కమల్ హాసన్ తో మొదలై రజినీకాంత్ - విక్రమ్ - సూర్య ఇలా అంతా మనవాళ్లే అన్నంతగా మారిపోయారు. అయితే వీళ్లలో హీరో సూర్య కి ఒక చక్కటి ఇమేజ్ ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులుకు దగ్గరయ్యాడు. గజిని సినిమాతో ఇక్కడ యూత్ ని ఆకట్టుకోవడంతో అప్పటి నుండి సూర్య సినిమాలు అన్ని తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి. అందుకు తగ్గట్లు గానే సూర్య కూడా కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ఇప్పుడు కూడ తన కొత్త సినిమా ‘తానా సేంద కూట్టం’ పోస్టర్ ఒకటి విడుదల చేశారు. ఇక్కడ సూర్య పోస్టర్ ను చూసిన ప్రతివారు ఒకటే అంటున్నారు ఏదో కొత్త కథతో మళ్ళీ వస్తున్నాడు అందరినీ తన నటనతో మెప్పించబోతున్నాడు అని. అయితే ఇక్కడ పోస్టర్ లో హీరో సూర్య రెండు గెటప్ లలో కనిపిస్తున్నాడు. ఒకటేమో ఒక సాధారణ నార్త్ చెన్నై వాసిగా కనిపిస్తున్నాడు మరో వైపు అంటే మిర్రర్ ఇమేజ్ లో ఒక ప్రొఫెషనల్‌ వ్యక్తిగా కొంత మంది ఉద్యోగులకు నాయకుడిగా కనిపిస్తున్నాడు. లుంగీ కట్టి లోకల్ వీదులలో ఏమి చేస్తాడో పాంట్ షర్ట్ వేసుకొని సమాజం కోసం ఏమి చేస్తాడో అనేది వేచి చూడవలిసిందే. సూర్య పుట్టినరోజు విడుదల చేసిన పోస్టర్ కన్నా ఇప్పుడు ఈ కొత్త పోస్టర్ సూపర్ హిట్ అయ్యింది అనే చెప్పాలి.

‘నానుం రౌడీదాన్‌’ చిత్రం ఫేమ్ విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తానా సేంద కూట్టం’. ఈ సినిమాలో సూర్య హీరోగా నటిస్తుంటే కీర్తి సురేష్‌ మెయిన్ లీడ్. రమ్యకృష్ణ - సెంథిల్‌ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పోస్టర్‌ ఇంత వైవిధ్యo ఉండడంతో సూర్య అభిమానులు ఆనందం ఆకాశానికి చేరాయి. అనిరుధ్‌ ఈ సినిమాకు సంగీతం సమకూర్చుతున్నాడు.​