Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: 90లలో మధూదయం

By:  Tupaki Desk   |   4 Aug 2015 1:40 AM GMT
ఫోటో స్టొరీ: 90లలో మధూదయం
X
ఉషోదయాన .. మధూదయం! వేకువఝాము నిదురలేచి నిన్ను చూస్తే చాలు ఓ నా సఖీ.. నా మనసు పరవశంతో వాగులా పొంగి పొర్లుతుంది. పర్వతం అంచులోంచి, సెలయేరు గళగళల మీది నుంచి సూటిగా వచ్చి తాకే పిల్ల సమీరంలా వయసు ఉరకలెత్తుతుంది. టీనేజీ పరువం పరవళ్లు తొక్కుతుంది. నిన్ను చూడగానే నా తలపు పదే పదే పరితపిస్తుంది. ఆహా ఏమి ఆ సౌందర్యం మధూ.. అలనాడు నిన్ను చూసిన నేను ఆనాడే మనసు పారేసుకున్నా. అయితే ఇప్పుడేమైంది ఆ ధరహాసం. ఏమైపోయావ్‌ నువ్వు? నీ మేనిలోని మాయమైన ఆ చిరునవ్వు ఎందుకు తిరిగి రాలేదు. ఒక శ్రీదేవి, ఒక హేమమాలినికి నువ్వేం తక్కువ? నీ నవ్వులో రోజాలున్నాయ్‌. నీ నడక, నడతలో మతి తప్పే సొగసుంది.

జెంటిల్‌ మేన్‌ లో నిన్ను చూసి మనసు పారేసుకున్నారు. అలాంటి నువ్వు ఈనాడు లేకుండా ఎటో వెళ్లావ్‌. అదిగో అపుడెపుడు అంతకుముందు ఆ తరవాత అంటూ వచ్చి పలకరించావ్‌. ఆ తర్వాతైనా కళ్ల ముందే నిలిచిపోతావ్‌? కనీసం అమ్మ, అక్క, అత్త, వదిన పాత్రల్లోనైనా నీ అభిమానులు ఇక్కడ చూసుకుంటామని మురిసిసోయారు. సహజసిద్ధమైన నీ నటనతో మమ్ము పరవశింపజేస్తావనే ఆశించాం. కానీ ఎందుకనో ఓ మౌనమునీశ్వరిలా అలాగే సైలెంటుగా ఉండిపోయావ్‌. మధూ .. ఎందుకిలా?.. మధుబాల 90లలో మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా, శంకర్ జెంటిల్ మ్యాన్ సినిమాలతో సంచలనం శ్రుష్టించిన సంగతి తెలిసిందే.