Begin typing your search above and press return to search.

పూరి దెబ్బ‌కు ఎలా అయిపోయాడో చూడండి..

By:  Tupaki Desk   |   31 May 2016 1:21 PM GMT
పూరి దెబ్బ‌కు ఎలా అయిపోయాడో చూడండి..
X
ఉన్న‌ట్లుండి ఈ ఫొటోలో ఉన్న వ్య‌క్తి పేరు చెప్ప‌మంటే జ‌వాబు చెప్ప‌డం క‌ష్ట‌మే కావ‌చ్చు. కాస్త ప‌రిశీల‌న‌గా చూస్తే త‌ప్ప ఇత‌నో టాలీవుడ్ హీరో అని.. ఓ బ‌డా ఫ్యామిలీకి చెందినవాడ‌ని గుర్తుప‌ట్ట‌డం క‌ష్టం. అంత‌లా మారిపోయాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. పూరి జ‌గ‌న్నాథ్ ట‌చ్ అంటే అలా ఉంటుంది మ‌రి. మొన్న త‌మ్ముడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ‘టెంప‌ర్’ లో స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేసిన పూరి.. ఇప్పుడు అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ ను కూడా మార్చేశాడు. కొన్ని రోజుల కింద‌టే పూరి-క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తాను చేస్తున్న జ‌ర్నలిస్టు పాత్ర కోసం క‌ళ్యాణ్ రామ్ స‌రికొత్త‌గా త‌యార‌య్యాడు.

పూరి ట్విట్ట‌ర్లో క‌ళ్యాణ్ రామ్ కొత్త లుక్ ను ప‌రిచ‌యం చేశాడు. ఈ మేకోవ‌ర్ లుక్ చూసి.. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. ట్విట్ట‌ర్లో ఈ పిక్ వెంట‌నే వైర‌ల్ అయిపోయింది. ఇంకా పేరు పెట్ట‌ని ఈ సినిమా కోసం పూరి త‌న‌దైన శైలిలో ప‌వ‌ర్ ఫుల్ క‌థ త‌యారు చేసిన‌ట్లు చెబుతున్నారు. జ్యోతిల‌క్ష్మి.. లోఫ‌ర్ ఫెయిల్యూర్ల త‌ర్వాత పూరి తనేంటో ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితిలో ఉన్నాడు. క‌ళ్యాణ్ రామ్ కూడా ‘షేర్’ త‌ర్వాత మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర చేస్తుండ‌టం విశేషం. మిస్ ఇండియా అదితి ఆర్య క‌థానాయిక‌గా ప‌రిచ‌యం కాబోతోంది. క‌ళ్యాణ్ రామే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేన‌ర్ మీద ఈ సినిమాను స్వ‌యంగా నిర్మిస్తున్నాడు.