Begin typing your search above and press return to search.

కారు నడుపుకుంటూ వెళ్లి.. ఈలేసిన బాలయ్య

By:  Tupaki Desk   |   15 Jan 2016 6:58 AM GMT
కారు నడుపుకుంటూ వెళ్లి.. ఈలేసిన బాలయ్య
X
కొందరు ప్రముఖుల చేసే కొన్ని చేష్టలు కాస్త ఆసక్తికరంగా.. మరికాస్త చిత్రంగా ఉంటాయి. తాజాగా బాలకృష్ణ వ్యవహారమే దీనికి నిదర్శం. తాను తాజాగా నటించిన డిక్టేటర్ సినిమాను చూసేందుకు తనకు తానే డ్రైవ్ చేసుకుంటూ నారావారి పల్లె నుంచి తిరుపతికి పయనమయ్యారు. సంక్రాంతి పండగను పురస్కరించుకొని తన కుటుంబ సభ్యులతోకలిసి బావ కమ్ వియ్యంకుడి ఇంటికి వచ్చిన బాలయ్య.. చంద్రబాబు స్వగ్రామం నుంచి తిరుపతిలోని కృష్ణ తేజ థియేటర్ కు వెళ్లారు. తాను నటించిన డిక్టేటర్ సినిమాను కాసేపు చేశారు. ఈ సందర్భంగా చిత్రంలోని కొన్ని సీన్లకు హాల్లోని ప్రేక్షకులతో పాటు.. బాలకృష్ణ సైతం ఉత్సాహంగా విజిల్ వేయటం విశేషం. అనంతరం అక్కడ నుంచి బయలుదేరిన బాలయ్య.. చంద్రగిరిలోని జీవీ సినిమాస్ థియేటర్ లోనూ తన సినిమాను చూశారు. ఇక్కడ బాలకృష్ణ వెంట ఆయన కుమారుడు కూడా ఉన్నారు. తన సీన్లకు తానే విజిల్ వేసుకున్న బాలయ్యబాబును చూసిన ఆయన అభిమానులు మరింత ఉత్సాహంతో విజిల్స్ వేశారు.
Tags: