Begin typing your search above and press return to search.

కూటమికి ఫుల్ జోష్ ఇచ్చిన రాజ్ నాధ్ సింగ్ !

కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ టీడీపీ కూటమికి ఫుల్ జోష్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు

By:  Tupaki Desk   |   24 April 2024 5:33 PM GMT
కూటమికి ఫుల్ జోష్ ఇచ్చిన రాజ్ నాధ్ సింగ్ !
X

కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ టీడీపీ కూటమికి ఫుల్ జోష్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. అవినీతి అక్రమాల పుట్ట అన్నారు. ఏపీలో అప్పు ఎంతో ఆయన గుట్టు విప్పి చెప్పేశారు. ఏపీలో అక్షరాలా 13. 50 లక్షల కోట్ల అప్పు ఉందని అన్నారు.

కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కి పదిహేను వేల కోట్లు ఇచ్చినా పూర్తి చేయకపోవడమేంటి అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వనికి చిత్తశుద్ధి ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తి అయ్యేదన్నారు. విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు అని మండిపడ్డారు.

టీడీపీ కూటమి కోసం ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజ్ నాధ్ సింగ్ వైసీపీ మీద ఒక రేంజి లో ఫైర్ అయ్యారు. విశాఖ టూరిజం సిటీగా పారిశ్రామిక నగరంగా అభివృద్ది చెందిందని గుర్తు చేశారు. అలాంటి నగరాన్ని వైసీపీ ప్రభుత్వం డ్రగ్స్ సిటీగా మార్చిందని ఆయన ఆరోపించారు.

సాంస్కృతిక, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా మారాల్సిన పేరు డగ్స్ రాజధానిగా మారుమోగుతుందని దుయ్యబట్టారు. ఇక, విశాఖలో ఎక్కడా లేని విధంగా భూకబ్జాలు జరిగాయని ఆరోపించారు రాజ్‌నాథ్ సింగ్. విశాఖలో ఈ తరహా భూ కబ్జాలు ఆగాలన్నా అవినీతి లేకుండా ఉండలన్నా బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావాలన్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఒక్కోక్కరి తలపై 2 లక్షల రూపాయల అప్పు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు.. వైసీపీ దుర్మార్గమైన పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించాలన్న ఉద్దేశ్యంతో కూటమి ఏర్పడిందన్నారు. తాము జాతీయ పార్టీగా ఉన్నప్పటికీ ఏపీలో మంచి ప్రభుత్వం అవినీతి లేని ప్రభుత్వం రావాలన్నఉద్దేశ్యంతో కూటమితోనే కలిశామని ఆయన చెప్పారు.

ఏపీలో అభివృద్ధి అన్నది టీడీపీ బీజేపీ జనసేన కూటమితో సాధ్యం అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటించారు. మొత్తం మీద చూస్తే బీజేపీ నుంచి నాయకులు ఏపీకి రావడం లేదని వచ్చి వైసీపీని విమర్శించడం లేదని టీడీపీ కూటమి పెద్దలకు ఒక దిగులు ఉండేది. ఇపుడు రాజ్ నాధ్ సింగ్ రాతో ఆ బెంగ తీరింది. ఆయన వైసీపీని దుమ్మెత్తిపోశారు. ఏపీలో వైసీపీని తూర్పారా పట్టేశారు. కూటమికి ఫుల్ జోష్ ని ఇచ్చారు. రానున్న రోజులలో మరింత మంది కేంద్ర మంత్రులు ఏపీకి వస్తారని అంటున్నారు. ఎన్నికల ప్రచారం కీలక సమయంలో వారంతా వైసీపీ మీద దండెత్తుతారు అని అంటున్నారు. దాంతో కూటమికి టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు.