Begin typing your search above and press return to search.

గుంటూరు టీడీపీ అభ్యర్ధి మాటలు పీక్స్ !

గుంటూరు టీడీపీకి ఒక ఎన్నారై పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన మీద మీడియా ఇపుడు ఫోకస్ పెట్టింది

By:  Tupaki Desk   |   25 April 2024 1:30 PM GMT
గుంటూరు టీడీపీ అభ్యర్ధి మాటలు పీక్స్ !
X

గుంటూరు టీడీపీకి ఒక ఎన్నారై పోటీ చేస్తున్నారు. దాంతో ఆయన మీద మీడియా ఇపుడు ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉంటే పెమ్మసాని చంద్రశేఖర్ మాటలు ఆయన ప్రకటనలు ఇపుడు చిత్రవిచిత్రంగా ఉంటున్నాయని అంటున్నారు. ఆయన రాజకీయాలకు కొత్త. దాంతో పాటు ఉన్నది అంతా అమెరికాలో. ఇపుడు ఆయన గుంటూరు ఎంపీ టికెట్ ని సాధించారు. టీడీపీ నుంచి గెలవాలని ఈసారి ప్రయత్నం చేస్తున్నారు.

దాంతో ఆయన చంద్రబాబుకు తెగ పొగుడుతున్నారు. ఆయన పాలనలో తెలుగు వారు బాగుపడ్డారు అని చెబుతున్నారు. ఈ ప్రచారం కాస్తా ఎందాకా వెళ్ళింది అంటే అమెరికాలో ఈ రోజున తెలుగువారు బెంజ్ కారు కొంటూ హాయిగా ఉన్నారు అంటే అది చంద్రబాబు చలవే అని ఆయన ఖాతాలో ఆ క్రెడిట్ ని తెచ్చి వేశారు.

ఈ విధంగా చెప్పడం ఆయనకు ఎలా ఉందో తెలియదు కానీ తెలుగు అమెరికన్లకు ఆయన అవమానం చేశారు అని అంటున్నారు. కేవలం చంద్రబాబు వల్లనే అమెరికాలోని తెలుగు వారు బతుకుతున్నారు అని కూడా ఆయన అంటున్నట్లుగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. బాబు తోనే అమెరికాలో తెలుగు వారు అంతా ఉపాధి పొందుతున్నారు అన్నట్లు చెప్పడం అంటే టీడీపీ ఎంపీ అభ్యర్ధి పిచ్చి పీక్స్ కి చేరుకుంది అని అంటున్నారు.

దీని మీద తెలుగు అమెరికన్స్ లో తీవ్రమైన చర్చ సాగుతోంది. ఇవేమి కామెంట్స్ అని కూడా అంటున్నారు. పెమ్మసానికి సీటు ఇస్తే ఆయన వరకూ చంద్రబాబుని పొగుడుకోవచ్చునని ఇందులో అమెరికా తెలుగువారిని ఇరికించడమేంటి అని గుస్సా అవుతున్నారు. ఏకంగా బాబు దయా దాక్షిణ్యాలతోనే అంతా అమెరికా వచ్చి బతుకు తున్నట్లుగా చెప్పడం వారిని అవమానించడం ఎంతవరకూ సబబు అని కూడా ప్రశ్నిస్తున్నారు.

ఇక ఏపీలోనే కాదు ఇండియాలోనే రిచెస్ట్ ఎంపీ అభ్యర్ధిగా ఉన్న పెమ్మసాని అమెరికాలో ఉన్న తన కంపెనీలలో ఎంతమంది తెలుగు వారికి జబ్స్ ఇచ్చారో చెప్పాలని అంటున్నారు. ఈ రోజున అమెరికాలో తెలుగు వారి సంఖ్య ఎక్కువ కావడానికి వారు ఉపాధి పొందడానికి అసలైన కారణం వైఎస్సార్ హయాంలో ఫీజ్ రీ ఇంబర్స్ మెంట్ ప్రవేశపెట్టి ఎంతో మందికి ఉన్నత చదువులకు ఆస్కారం కల్పించడమే అంటున్నారు. ఈ సంగతి పెమ్మసానికి గుర్తుకు వచ్చినట్లుగా లేదని అంటున్నారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో గెలిస్తే గుంటూరుకు ఏమి చేస్తారు అంటే అది ఇపుడు చెప్పను గెలిచిన తరువాతనే అంటూ పెమ్మసాని తప్పించుకోవడం మీద కూడా చర్చ సాగుతోంది. రాజకీయాల్లో గెలిచిన తరువాత చేస్తాను తరువాత చెబుతాను అంటే కుదరదు అని సదరు టీవీ చానల్ యాంకర్ చెప్పినా పెమ్మసాని తనదైన వాదనతోనే ముందుకు సాగారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ పొలిటికల్ సెన్సార్ బోర్డుని తెస్తాను అని అనడం పట్ల కూడా విస్మయం అవుతోంది. మాట్లాడేందుకు అందరికీ స్వేచ్చ ఉంది. అది భావ ప్రకటన హక్కు. రాజ్యాంగం అందించినది ఈ హక్కు. అలాంటిది కేవలం పొలిటికల్ ఫీల్డ్ లో ఉన్న వారి కోసం సెన్సార్ బోర్డు అని అంటున్నారు అంటే పెమ్మసానికి రాజకీయాల మీద అవగాహన ఏపాటిది అన్న చర్చ కూడా సాగుతోంది.