Begin typing your search above and press return to search.

'టీడీపీని గెలిపించేది వీళ్ళు మాత్రమే'... మళ్లీ తగులుకున్న మహాసేన రాజేష్!

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యారని చెబుతున్నారు రాజేష్.

By:  Tupaki Desk   |   8 May 2024 5:09 PM GMT
టీడీపీని గెలిపించేది  వీళ్ళు మాత్రమే... మళ్లీ తగులుకున్న మహాసేన రాజేష్!
X

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ మొదటి విడత అభ్యర్థుల జాబితాలోనే ఎమ్మెల్యే టిక్కెట్ సాధించుకుని.. అనంతరం జనసేన నుంచి వచ్చిన అభ్యంతరాల నడుమ ఆ స్థానం కోల్పోయిన సరిపల్లి రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్.. తాజాగా పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా... జనసేన అధినేత మా వర్గాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారు.. ఇక్కడున్న బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.. అందువల్ల మేము ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నాము అని చెబుతూ.. జనసేనను ఓడించడానికి తమ వంతు కృషి చేస్తామని చెబుతూ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యారని చెబుతున్నారు రాజేష్.

అవును.. మహాసేన, జనసేనకు మద్దతు ఉపసంహరించుకునే విషయాన్ని వెల్లడించడంపై పలువురు టీడీపీ నేతలు మాట్లడుతూ... పార్టీని ఆయన గెలిపించడానికి వచ్చారు అని జనసేన నేతలతో కలిసి అంటున్నారని చెప్పుకొచ్చారు రాజేష్! ఈ సందర్భంగా తెలుగు దేశాన్ని గెలిపించేది ఎవరు? అని ప్రశ్నించిన ఆయన... అది ఎవరో, ఎలానో వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా... లోకేష్, చంద్రబాబు, భువనేశ్వరిల ప్రస్థావన తెచ్చారు.

ఇందులో భాగంగా... "దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు ఎండనకా, కొండనకా తిరిగి.. టీడీపీకి కొత్త జోష్ తీసుకొచ్చింది నారా లోకేష్! ఎన్నో అవమానాలు, ఎన్నో దాడులు, ఎన్నో హత్యా ప్రయత్నాలు తట్టుకుని ధైర్యంగా కింగ్ లా తిరిగి.. ఈ రోజు టీడీపీకి నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చారు"... ఇదే సమయంలో... "ఇదేం కర్మ", "బాదుడే బాదుడు" అంటూ 74 ఏళ్ల వయసులో ఒకపక్క హత్యా ప్రయత్నాలు జరుగుతున్న సరే రాష్ట్రమంతా తిరిగి తెలుగుదేశానికి నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు" అని అన్నారు.

ఇదే క్రమంలో... "ఎప్పుడూ ఇంటిబయటకు రాని భువనేశ్వరి.. న్యాయం గెలవాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఒక్కరి ఇంటికీ తిరిగి, వారి న్యాయం చేసి, వారికి అండగా నిలబడి పార్టీకి ఈ రోజున ఈ స్థాయి ఆదరన తీసుకొస్తే... ఎవరో వచ్చి 'వ్యాన్' మీద నుంచుని నాలుగు మాటలు మాట్లాడితే.. వాళ్లు టీడీపీని నెగ్గిస్తున్నారని అంటారా" అంటూ ఫైర్ అయ్యారు మహాసేన రాజేష్. ఈ సందర్భంగా... కష్టపడేవారిని పక్కకు నెట్టేస్తున్నారని, షో ఆఫ్ చేసేవారు పార్టీని నెగ్గిస్తారా అని ప్రశ్నించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు టీడీపీ - జనసేనల్లో వైరల్ గా మారుతున్నాయని అంటున్నారు!