Begin typing your search above and press return to search.

వైసీపీలో టీడీపీ నేత మాగంటి బాబు... క్లారిటీ వచ్చేసింది!

అవును... ఏలూరు లోక్ సభ టిక్కెట్ విషయంలో తీవ్ర అసంతృప్తికి లోనైన మాగంటి బాబు టీడీపీని వీడుతున్నట్లు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 March 2024 6:46 AM GMT
వైసీపీలో టీడీపీ నేత మాగంటి బాబు...  క్లారిటీ వచ్చేసింది!
X

గత 24 గంటలుగా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వర రావు (మాగంటి బాబు) కు సంబంధించిన ఒక వార్త అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఏలూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షా క్ తలిగే అవకాశాలున్నాయని.. ఇప్పటికే హైదరాబాద్ లో వైసీపీ నేతలతో మాగంటి బాబు చర్చలు జరుపుతున్నారని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో మాగంటి స్పందించారు.

అవును... ఏలూరు లోక్ సభ టిక్కెట్ విషయంలో తీవ్ర అసంతృప్తికి లోనైన మాగంటి బాబు టీడీపీని వీడుతున్నట్లు వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆయన పార్టీని వీడటానికి రెడీ అయ్యారని కథనాలొచ్చాయి. ఇదే సమయంలో గోరుముచ్చు గోపాల్ యాదవ్ సైతం వైసీపీలో జాయిన్ అవ్వడంతో.. మాగంటి చేరిక కూడా దాదాపు ఖాయమనే విషయాలు వైరల్ గా మారాయి. ఈ సమయంలో స్పందించిన మాగంటి... తాను పార్టీ మారడం లేదని అన్నారు.

ఇందులో భాగంగా... తాను పార్టీ మారుతున్నట్లు వస్తోన్న వార్తలపై స్పందించిన మాగంటి గోపీనాథ్... గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని, టీడీపీని విడిచిపెట్టే ఆలోచన తనకు లేదని, వ్యక్తిగత పనుల నిమిత్తమే తాను హైదరాబాద్ లో ఉండటం వల్ల క్యాంపు కార్యాలయానికి అందుబాటులో లేనట్లు వెల్లడించారు. దీంతో... ఈ కథనాలకు క్లారిటీ వచ్చినట్లయ్యింది.

మరోపక్క టీడీపీ ఏలూరు పార్లమెంట్‌ నాయకులు గోరుముచ్చు గోపాల్‌ యాదవ్... వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సమయంలో ఆయన వెంట తణుకు ఎమ్మెల్యే అభ్యర్ధి కారుమూరి నాగేశ్వరరావు, దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్ధి కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్‌ అభ్యర్ధి కారుమూరి సునీల్‌ ఉన్నారు. ఈ సమయంలోనే మాగంటి బాబు పేరు తెరపైకి వచ్చింది.

కాగా... ఏలూరు ఎంపీగా పోటీచేసి 2014లో గెలిచి 2019లో ఓడిపోయిన మాగంటి బాబుతో పాటూ గోపాల్ యాదవ్ కూడా ఏలూరు ఎంపీ టిక్కెట్ ఆశించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో గోపాల్ యాదవ్ కి టిక్కెట్ కన్ ఫాం అని చెప్పిన చంద్రబాబు, లోకేష్ లు డబ్బులు బాగా ఖర్చు పెట్టించరని.. అనంతరం, యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ కి టిక్కెట్ ఇచ్చారని.. దీంతో.. మాగంటి అనుచరులు, అభిమానులు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు!