Begin typing your search above and press return to search.

తిరుపతి మాస్టర్ ప్లాన్ పేరుతో భారీ స్కాం?

నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:46 AM GMT
తిరుపతి మాస్టర్ ప్లాన్ పేరుతో భారీ స్కాం?
X

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అధికార పార్టీపై విపక్షాలు విరుచుకుపడటం.. అదే సమయంలో విపక్షనేతలపై అధికార పార్టీ నేతలు ఘాటు విమర్శలు చేయటం తెలిసిందే. తాజాగా ఇలాంటి సీన్ ఒకటి చోటు చేసుకుంది. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి.. ఆయన తనయుడు కం తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ రెడ్డిలు భారీ స్కాంకు పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధికారప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి. దొంగ జీపీఏల్ని క్రియేట్ చేసి ప్రజాధనాన్ని భారీగా దోచుకున్నట్లుగా ఆరోపించారు.

నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. తిరుపతిలో 18 రోడ్లు విస్తరిస్తున్నట్లుగా చెప్పి అక్కడి స్థలాల్ని కోల్పోయిన వారికి 375 టీడీఆర్ బాండ్లను ఇచ్చారని.. వాటిల్లో సగానికి పైనే అక్రమంగా ఆరోపించారు. దొంగ జీపీఏలతో రిజిస్ట్రేషన్ చేసిన వాటికి.. వివాదాస్పద భూములకు బాండ్లను ఇచ్చారన్నారు. తిరుపతి పట్టణంలోనే కాదు రోడ్డు విస్తరణ చేపట్టే గ్రామీణ ప్రాంతాలను కూడా వాణిజ్య స్థలాలుగా పేర్కొనటం గమనార్హం.

మొత్తం బాండ్ల విలువ రూ.4052 కోట్లు కాగా.. తమకు కావాల్సిన వారికి లబ్థి చేకూరేలా అక్రమాలకు పాల్పడినట్లుగా మండిపడ్డారు. కంచి రాము అనే వ్యక్తికి బాండ్ నెంబరు 0356 కింద రూ.61.02 కోట్లు ఇచ్చారని.. అసలు ఆ భూమికి రాముకు సంబంధించింది కాదన్నారు. ఇదే విషయాన్ని అప్పటి జేసీ బాలాజీ తేల్చినట్లుగా చెప్పిన ఆనం.. రెవెన్యూ కోర్టులో పెండింగ్ లో ఉన్న భూమికి టీడీఆర్ బాండ్లు ఇవ్వటం వెనుక అసలు లెక్కేంటి? రాము ఫ్యామిలీపై కేసులు ఉన్నాయని జేసీ స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాంటి రాముకు టీఆర్ఎస్ బాండ్ల కింద రూ.61 కోట్లు ఎలా ఇచ్చారని.. రేపొద్దున సదరు భూమి రాముది కాదంటే ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. ఇదే రీతిలో డి. మురళీ పేరుతో ఉన్న బాండ్ నంబరు 00062 అని ఆనం వెల్లడించారు. ఇతడికి రూ.13 కోట్లు ఇచ్చారని.. భూమి విలువను మదింపు విషయంలో కొద్ది రోజుల వ్యవధిలోనే చదరపు గజానికి రూ.40 వేల చొప్పున పెంచేయటంపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. కమర్షియల్ స్పేస్ గా పేర్కొంటూ చదరపు గజం రూ.1.60 లక్షల చొప్పున పెంచి బాండ్ జారీ చేయటం విశేషం.