Begin typing your search above and press return to search.

గెస్సింగ్ లేకుండానే స‌ర్ ప్రైజ్ చేసారే!

తాజాగా సూర్య‌-కార్తీక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్ కూడా అలాంటిదేన‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 March 2024 7:23 AM GMT
గెస్సింగ్  లేకుండానే స‌ర్ ప్రైజ్ చేసారే!
X

కొన్ని కాంబినేష‌న్లు ఎలాంటి ప్ర‌చారం లేకుండానే హ‌ఠాత్తుగా తెర‌పైకొచ్చి స‌ర్ ప్రైజ్ చేస్తుంటాయి. క‌నీసం ఊహ‌కి కూడా రాని కాంబినేష‌న్స్ కొన్నిబ్యాకెండ్ వ‌ర్క్ చేసి సెలైంట్ గా ముందుకొచ్చేస్తుంటారు. తాజాగా సూర్య‌-కార్తీక్ సుబ్బ‌రాజ్ కాంబినేష‌న్ కూడా అలాంటిదేన‌ని తెలుస్తోంది. ఈ కల‌యిక‌లో సినిమా ఉంటుం ద‌ని ఇంత‌వ‌ర‌కూ ఎక్క‌డా తెర‌పైకి రాలేదు. ఏ కోలీవుడ్ మీడియాలో కూడా వార్త రాలేదు.

ఇద్ద‌రు ఎవ‌రి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు త‌ప్ప‌! క‌లిసి పనిచేస్తున్న‌ట్లు వాళ్ల‌కైనా తెలుసా? అన్నంత‌గా ఇప్పుడు స‌ర్ ప్రైజ్ చేసారు. సూర్య 44వ చిత్రానికి కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. ప్రేమ‌.. హాస్యం..యాక్ష‌న్ మేళ‌వింపుతో కార్తీక్ సుబ్బ‌రాజ్ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం సూర్య హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో పిరియాడిక్ చిత్రం 'కంగువా' తెర‌కెక్కుతోంది.

ఇది సూర్య కెరీర్ లో 42వ చిత్రం. వ‌ర‌ల్డ్ వైడ్ 38 భాష‌ల్లో రిలీజ్ అవుతున్న తొలి ఇండియ‌న్ చిత్రం ఇదే కావ‌డం విశేషం. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇక సూర్య 43వ చిత్రం సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. కంగువా పూర్తికాగానే ఈసినిమా ప్రారంభం అవుతుంది. ఇక కార్తిక్ సుబ్బ‌రాజ్ ట్రాక్ రికార్డు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `పిజ్జా` తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన కార్తీక్ అనతి కాలంలో సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ నిసైతం డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిం దే.

ఇంకా మ‌రెంతో మంది స్టార్ హీరోల్ని డైరెక్ట్ చేసాడు. సూర్య‌తో అవ‌కాశం రావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది. `కంగువా`..సుధ కొంగ‌ర సినిమాల త‌ర్వాత రిలీజ్ అయ్యే చిత్రం కాంబ‌ట్టి అంచ‌నాలు ప‌తాక స్థాయిలోనే ఉంటాయి. ఈ సినిమా 2024 చివ‌ర్లో గానీ...2025 లో గానీ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.