Begin typing your search above and press return to search.

యంగ్ టైగ‌ర్ నుంచి ఇది ఊహించ‌నిది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల హైద‌రాబాద్ టు ముంబై ప్ర‌యాణాల్లో బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 5:10 AM GMT
యంగ్ టైగ‌ర్ నుంచి ఇది ఊహించ‌నిది
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌ల హైద‌రాబాద్ టు ముంబై ప్ర‌యాణాల్లో బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం `వార్ 2`లో తార‌క్ న‌టిస్తున్నాడు. కొద్ది రోజులుగా హృతిక్- ఎన్టీఆర్ జోడీపై భారీ ఫైట్ సీక్వెన్సులు, పాట‌ను కూడా చిత్రీక‌రిస్తున్నార‌ని ట‌క్ ఉంది.


ఆన్ లొకేష‌న్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయిన సంగ‌తి తెలిసిందే. అదంతా అటుంచితే తార‌క్ కొంత అప్ర‌శాంతంగా సీరియ‌స్ గా ఉన్న ఓ ఫోటో ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ఫోటోని వీక్షించ‌గానే యంగ్ య‌మ‌కు ఏమైంది? ఇంత కోపంగా క‌నిపిస్తున్నాడు? అంటూ ఫ్యాన్స్ లో చ‌ర్చ మొద‌లైంది. ఎవ‌రిపైనో అత‌డు కోప్ప‌డుతున్న‌ట్టే ఉంది? అంత‌గా కూల్ ఎన్టీఆర్ టెంప‌ర్ చూపించ‌డానికి రీజ‌న్ ఏమిటి? అంటూ ఆరాలు కూడా మొద‌ల‌య్యాయి.

నిజానికి ఎన్టీఆర్ ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉంటాడు. ఇబ్బంది ఏదైనా కానీ అంత‌గా స్పందించ‌డు. ఎదుటివారిపై చికాకు ప‌డ‌డు. కానీ ఇప్పుడిప్పుడే ముంబై మీడియాకి పూర్తిగా అల‌వాటు ప‌డుతున్న ఎన్టీఆర్ కి ఏదో ఇర్రిటేటింగ్ సిట్యుయేష‌న్ ఎదురైంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ముంబై మీడియా సినీసెల‌బ్రిటీల‌ను వెంటాడి వేటాడి మ‌రీ మీది మీదికి ఉరికి ఫోటోషూట్లు చేస్తుంది. బ‌హుశా ఇది తార‌క్ కి న‌చ్చ‌లేదేమోన‌ని భావిస్తున్నారు. ముంబైలోని ఒక హోటల్ ప‌రిస‌రాల్లో ఉన్న తార‌క్ పై ప‌దే ప‌దే ఫ్లాష్‌లు మెరుస్తున్నాయి. కానీ అత‌డు ఒకానొక స‌మ‌యంలో కొంత సీరియ‌స్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఆపండి! అంటూ కెమెరాల‌కు అత‌డు గ‌ట్టిగానే చెప్పాడ‌ట‌. ఈ ఫోటోల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. స్పాట్ లో వైట్ ష‌ర్ట్ లో ఎన్టీఆర్ ఎంతో స్మార్ట్ గా క‌నిపిస్తున్నాడు. కానీ వార్ 2లో త‌న వేష‌ధార‌ణ‌ను పూర్తిగా ఓపెన్ చేసేస్తున్న ముంబై మీడియాపై తార‌క్ కొంత అస‌హ‌నంగా ఉన్న‌ట్టే భావించాల్సి ఉంటుంది.

వార్ లో ఎన్టీఆర్ విల‌న్ గా న‌టిస్తున్నాడ‌ని లేదూ అత‌డు కీల‌క పాత్ర‌లో మాత్ర‌మే క‌నిపిస్తున్నాడ‌ని ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం ఉంది. అయితే హృతిక్ తో నువ్వా నేనా? అంటూ ఢీకొట్టేవాడిగా తార‌క్ పాత్ర ఉంటుంద‌ని అభిమానులు ఆశిస్తున్నారు. వార్ 2 2025 స్వాతంత్య్ర‌ దినోత్సవం రోజున విడుదల కానుంది. వార్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కియ‌రా అద్వాణీ ఒక క‌థానాయిక‌గా న‌టిస్తోంది.