Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో ప్రేమ - నవ్వు - యుద్దం

మరో వైపు సుధ కొంగర దర్శకత్వంలో కూడా సూర్య ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   29 March 2024 6:54 AM GMT
స్టార్‌ హీరో ప్రేమ - నవ్వు - యుద్దం
X

తమిళ స్టార్‌ హీరో సూర్య త్వరలో కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. కోలీవుడ్‌ బాహుబలి అంటూ కంగువా సినిమా ను తెగ ప్రమోట్‌ చేస్తున్నారు. మరో వైపు సుధ కొంగర దర్శకత్వంలో కూడా సూర్య ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా మరో సినిమాను సూర్య కమిట్ అయ్యాడు.

సూర్య తాజాగా తన కొత్త సినిమాను కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో చేయబోతున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న కార్తీక్ సుబ్బరాజు ఇప్పటికే సూర్య సినిమా కోసం విభిన్నమైన టైటిల్ 'లవ్‌ లాఫర్‌ వార్‌' (ప్రేమ - నవ్వు - యుద్దం) ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు సినిమా యొక్క స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. సూర్య ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో సంబంధం లేకుండా ఈ సినిమాను త్వరలోనే పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి అని తమిళ మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

సూర్య కంగువ తో పాటు సుధ కొంగర ద్శకత్వంలో చేస్తున్న సినిమాలకు పూర్తి విభిన్నమైన సినిమాగా ఈ సినిమా ను గురించి ప్రచారం జరుగుతుంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షించాయి. కనుక సూర్య, కార్తీక్ సుబ్బరాజు సినిమా కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్ లో మంచి బజ్ క్రియేట్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.