Begin typing your search above and press return to search.

టీమిండియా ప్రపంచ కప్ కీపర్ అతడే.. పంత్ కాదు?

వికెట్ కీపర్ బ్యాటర్లుగా రిషభ్ పంత్ తో పాటు కేరళకు చెందిన సంజూ శాంసన్ ను తీసుకున్నారు. దీంతోనే విమర్శలకు అవకాశం లేకపోయింది.

By:  Tupaki Desk   |   11 May 2024 12:30 AM GMT
టీమిండియా ప్రపంచ కప్ కీపర్ అతడే.. పంత్ కాదు?
X

ప్రతిభ ఉన్నవాడే.. కానీ, నిలకడ లేదు.. అవకాశాలు ఇవ్వొచ్చు.. కానీ, నిలబెట్టుకోలేడు.. కీపింగ్, బ్యాటింగ్ దుమ్మురేపుతాడు.. కానీ, మ్యాచ్ విన్నర్ కాదు. టి20లకు పనికొస్తాడు.. వన్డేలకు సరిపోడేమో..? టెస్టులకు మాత్రం కష్టమే.. ఇదీ ఆ యువ క్రికెటర్ పై కొన్నాళ్లుగా వస్తున్న పాటిజివ్ నెగిటివ్ వ్యాఖ్యలు. ప్రతిసారీ పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలన సిరీస్‌ లేదా పెద్ద టోర్నీకి టీమిండియాను ఎంపిక చేస్తుంటే అతడివ పేరు వినిపించేది. జట్టులోకి తీసుకోకుంటే విమర్శలు కురిసేవి. విఫలం అవుతున్న ఆటగాళ్లకు చాన్స్ లు ఇస్తూ.. ఏం చేసినా మౌనంగా ఉంటున్నఇతడిని పక్కన పెడుతున్నారని విమర్శలు వచ్చేవి. అయితే, ఈసారి అలాంటివాటికి చాన్స్ లేదు.

పంత్ కంటే ఎక్కువగా దుమ్ము రేపుతున్నాడు..వచ్చే నెల ప్రారంభం నుంచి టీమిండియా టి20 ప్రపంచ కప్ లో పాల్గొననుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న అందరూ వారం వ్యవధిలోనే వెస్టిండీస్ దీవులకు ప్రయాణం కానున్నారు. అయితే, కొద్ది రోజుల కిందట టీమిండియా ఎంపిక సందర్భంగా కీలక పరిణామం జరిగింది. వికెట్ కీపర్ బ్యాటర్లుగా రిషభ్ పంత్ తో పాటు కేరళకు చెందిన సంజూ శాంసన్ ను తీసుకున్నారు. దీంతోనే విమర్శలకు అవకాశం లేకపోయింది. పోయినసారి శాంసన్ ను టి20 ప్రపంచ కప్‌లోకి తీసుకోలేదు. దీంతో అతడి అభిమానులు సెలక్టర్లపై విరుచుకుపడ్డారు. తన పేరు ట్విట్టర్లో ట్రెండ్‌ అయింది. ఇప్పడు మాత్రం ఐపీఎల్‌ లో అత్యంత నిలకడగా, మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుండడంతో శాంసన్ ను మరో మాట లేకుండా జట్టులోకి తీసుకున్నారు.

11 మ్యాచ్ లు 471 పరుగులు.. ఐపీఎల్ 17 సీజన్ లో సంజూ శాంసన్ దూకుడు మామూలుగా లేదు. 11 మ్యాచ్‌ లలో అతడు 471 పరుగులు చేశాడు. సగటు 67.28 .ఇక స్ట్రైక్‌ రేట్‌ ఏకంగా 163.54. పదిపైగా మ్యాచ్ ల తర్వాత ఈ గణాంకాలు అద్భుతం అనే చెప్పాలి. ఐపీఎల్‌-17 టాప్ బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు. వాస్తవానికి రాజస్థాన్ కు కొన్నాళ్లుగా సంజూ కెప్టెన్. కానీ, ఈసారి ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ లో ఉండడానికి కారణంగా అతడే. టీమిండియా తరఫున సంజూ

25 మ్యాచ్‌ లలో 18.70 సగటుతో 374 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క అర్ధశతకమే ఉంది. వన్డేల్లో 16 మ్యాచ్‌ లలో 56.66 సగటుతో 510 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాపై దక్షిణాఫ్రికాలోనే సెంచరీ (108) కొట్టాడు.

పంత్ కాదు అతడే.. గాయంతో ఏడాది పైగా టీమిండియా దూరమై.. ఈ ఐపీఎల్ తో పునరాగమనం చేసిన రిషభ్ పంత్ లీగ్ లో బాగానే ఆడుతున్నాడు. కానీ, అతడికి మించి సంజూ రాణిస్తున్నాడు. దీంతో ప్రపంచ కప్ లో మొదట సంజూకే చాన్స్ దొరకొచ్చు. లేదా యశస్వి బదులు కోహ్లిని ఓపెనర్ గా పంపి.. పంత్, సంజూ ఇద్దరికీ చోటివ్వవచ్చు. మొత్తానికి అయితే సంజూను ఆడించక తప్పని పరిస్థితి ఉంది. టీమ్ మేనేజ్ మెంట్ ఏం చేస్తుందో చూద్దాం..