కూలీ రిలీజ్ ముందే.. OTT సర్ ప్రైజ్..!
కూలీ ఆడియో రిలీజ్ వేడుక సన్ నెక్స్ట్ లో కూలీ అన్ లీష్డ్ అంటూ రిలీజ్ చేశారు.
By: Ramesh Boddu | 11 Aug 2025 3:24 PM ISTసూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమా రిలీజ్ ముందే ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. కూలీ అన్ లీష్డ్ అంటూ కూలీ సినిమాకు సంబంధించిన ఆడియో రిలీజ్ ని సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేసింది. సినిమాలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో రోల్ లు గ్రాండ్ గా చేస్తారు. ఐతే అవి మన తెలుగు నిర్మాతలు యూట్యూబ్ లైవ్ ఇస్తారు. కానీ తమిళ్ మేకర్స్ అలా కాదు. వాటిని తర్వాత చిన్నగా ఓటీటీలో రిలీజ్ చేస్తారు.
సన్ నెక్స్ట్ లో కూలీ..
కూలీ ఆడియో రిలీజ్ వేడుక సన్ నెక్స్ట్ లో కూలీ అన్ లీష్డ్ అంటూ రిలీజ్ చేశారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ రజినీ స్పీచ్, అనిరుద్ చేసిన మ్యూజికల్ హంగామా, కింగ్ నాగార్జున స్పీచ్, అమీర్ ఖాన్, ఉపేంద్ర స్పీచ్ ఇలా అందరు మాట్లాడింది ఉంటుంది. తమిళ్ లో ఇలాంటి ఈవెంట్స్ ని కూడా క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు. అవార్డ్ ఫంక్షన్స్ లాంటివి ఎలాగైతే ఓటీటీలో రిలీజ్ చేస్తారో కూలీ రిలీజ్ ముందు ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ స్ట్రీమింగ్ చేశారు.
సన్ నెక్స్ట్ కి మిగతా ఓటీటీ సంస్థలతో పోలిస్తే అంత గొప్ప సబ్ స్క్రైబర్స్ ఉండరు. కానీ కాంబో ప్యాక్ లతో సన్ నెక్స్ట్ పొందే వారు చాలామంది ఉంటారు. అంటే ఎయిర్ టెల్, జియో మొబైల్ ప్లాన్స్ తో పాటు ఫైబర్, ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ లో కూడా సన్ నెక్స్ట్ ని అందుబాటులో ఉంచుతారు. దాని వల్ల ఆ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ సంఖ్య పెరుగుతుంది.
లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో..
కోలీవుడ్ లో ఎలాంటి ఈవెంట్ జరిగినా ఇది ఆనవాయితీగా వస్తుంది. అనవసరంగా లైవ్ ఇవ్వడం దేనికి కొన్ని ప్రోమోస్ వదిలి ఓటీటీ రిలీజ్ చేస్తే కాస్త కూస్తో వ్యూయర్స్ షిప్ అయినా వస్తుందని అలా చేస్తారు. కూలీ సినిమాను నిర్మించింది కూడా సన్ నెక్ట్ వర్క్ కళానిథి మారనే. సో సన్ నెక్స్ట్ లో కూలీ ఆడియో వచ్చేసింది. మరి ఎవరెవరు ఈ ప్రాజెక్ట్ పై ఎలా మాట్లాడారు అన్నది ఒక లుక్కేయండి.
కూలీ సినిమా ఆగష్టు 14న రిలీజ్ అవుతుంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందని అంటున్నారు. అంతేకాదు సినిమాలో స్టార్ క్యామియోస్ ప్రాజెక్ట్ పై మరింత హైప్ తెచ్చింది. తప్పకుండా కూలీతో రజినీకి లోకేష్ ఒక మెమొరబుల్ హిట్ ఇచ్చేలా ఉన్నారు.