ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సీరీస్ , సినిమాలు ఇవే!
మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు సిద్ధమయ్యాయి.
By: Madhu Reddy | 11 Aug 2025 12:50 PM ISTఆగస్టు నెల ప్రారంభమై అప్పుడే వారం గడిచిపోయింది. ఇప్పుడు రెండవ వారం కూడా ప్రారంభం అయింది. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీ లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఈ వారం ఒక్కటే 30 సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుండడంతో అందరూ చాలా ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓటీటీ వెబ్ సిరీస్, చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14వ తేదీన రజనీకాంత్ 'కూలీ' చిత్రంతో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న ' వార్ 2 ' సినిమా థియేటర్లలోకి రానున్నాయి. వీటి కోసం యావత్తు దేశ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు . అటు మరొకవైపు ఓటీటీ లలో కూడా ప్రేక్షకులను అలరించడానికి మొత్తం 30 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. అందులో తెలుగు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉండడం గమనార్హం.
నెట్ ఫ్లిక్స్ :
సులివన్ క్రాసింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్ట్ 11
ఔట్ ల్యాండర్ సీజన్ 7 పార్ట్ వన్ (ఇంగ్లీష్ సిరీస్) -ఆగస్టు 11
ఫైనల్ డ్రాఫ్ట్ (ఇంగ్లీష్ సిరీస్) -ఆగస్టు 12
జిమ్ జెఫ్రీస్ ( ఇంగ్లీష్ సినిమా ) -ఆగస్టు 12
ఫిక్స్డ్ (ఇంగ్లీష్ మూవీ) -ఆగస్టు 13
లవ్ ఈజ్ బ్లైండ్ : యూకే సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) -ఆగస్టు 13
సారే జహాసే అచ్చా (హిందీ సిరీస్) -ఆగస్టు 13
సాంగ్స్ ఫ్రమ్ ద హోల్ (ఇంగ్లీష్ సినిమా ) -ఆగస్టు 13
యంగ్ మిలియనీర్స్ (ఫ్రెంచ్ సిరీస్ ) -ఆగస్టు 13
ఇన్ ద మడ్ (స్పానిష్ సిరీస్) - ఆగస్టు 14
మోనోనొక్ మూవీ ద సెకండ్ చాప్టర్ (జపనీస్ సినిమా ) -ఆగస్టు 14
ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్ ) -ఆగస్టు 15
ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) - ఆగస్టు 15
ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15
జీ 5:
టెహ్రాన్ (హిందీ సినిమా) - ఆగస్టు 14
జానకి.వి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఆగస్టు 15
అమెజాన్ ప్రైమ్ :
అంధేరా (హిందీ సిరీస్) - ఆగస్టు 14
హాట్ స్టార్:
డాగ్ మ్యాన్ (ఇంగ్లీష్ యానిమేషన్ సినిమా) - ఆగస్టు 11
డ్రాప్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 11
ఐరన్ మ్యాన్ అండ్ హిజ్ ఆసం ఫ్రెండ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12
ఏలియన్ : ఎర్త్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13
లిమిట్ లెస్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 15
బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 17
ఆపిల్ ప్లస్ టీవీ :
స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 15
సోనీ లివ్ :
కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17 (రియాలిటీ షో) - ఆగస్టు 11
కోర్ట్ కచేరి (హిందీ సిరీస్ ) ఆగస్టు 13